Search
Wednesday 21 November 2018
  • :
  • :

కోటాకు సుప్రీం రక్షణ కోట

Supreme-‘అణగారిన వర్గాలను రిజర్వేషన్‌కు దూరం చేయొద్దు’
న్యూఢిల్లీ: అవకాశాలు అందుకోలేకపోయిన పీడిత వర్గాల కోటా ప్రయో జనాలను తోసిపుచ్చరాదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. నిర్దేశించిన తేదీ లోపు ఒబిసి సర్టిఫికెట్ దాఖలు చేయకుంటే సెలక్టెడ్ విద్యార్థులకు కోటా ప్రయోజనాలు వర్తించవంటూ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పులో పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇదే విషయంలో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను ఆలస్యంగా సమర్పించారన్న కారణంగా ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుల ప్రయోజనాలను తోసిరాజనడం సరికాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌తో కూడి న డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసమానత్వాన్ని తొలగించేందుకే ఎస్‌సి, ఎస్‌టిలు, సమాజంలో విద్యా పరంగా, సామాజికపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని బెంచ్ స్పష్టం చేసింది. రిజర్వేషన్ల లక్షం కూడా ఇదేనని పేర్కొంది. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నందున బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దూరం చేయరాదని స్పష్టం చేసింది. 2008లో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు చివరి తేదీ లోపు ఒబిసి సర్టిఫికెట్లు సమర్పించలేకపోయారు. అనంతరం తమకు ఉద్యోగాలు నిరాకరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఒబిసి కేటగిరి విషయంలో అప్పిలెంట్స్ , ఇతర బాధిత అభ్యర్థుల అప్లికేషన్లు పరిశీలించాల్సిందిగా సింగిల్ బడ్జి బెంచ్ ఢ్లిలీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డును ఆదేశించింది.

Comments

comments