Home పెద్దపల్లి అట్టుడుకుతున్న మంథని

అట్టుడుకుతున్న మంథని

Police-Enquiry

అంబేడ్కర్ విగ్రహం ముందు మౌన దీక్షలో మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు: కుర్చీ కోసమే శ్రీధర్‌బాబు తనపై కుట్ర..!
మధూకర్ మృతిపై రీ పోస్టుమార్టంకు
మేజిస్ట్రేట్‌కు లేఖ..!
మంథని మధూకర్ మృతిపై పెద్దపల్లి
ఎసిపి విచారణ..!
కుటుంబ సభ్యుల సమక్షంలో పరిసరాల పరిశీలన

మంథని: మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మార్చి 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం, స్థానిక పోలీసుల విచారణపై మధూకర్ కుటుంబసభ్యులు, దళిత, ఇతర సంఘాల నేతలు అనుమానాలు, అందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో పెద్దపల్లి ఎసిపి సింథూశర్మను విచారణాధికారిగా రామగుండం సిపి నియామించగా, సోమవారం మధూకర్ శవం లభ్యమైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని, చుట్టూ పరిసరాలను మధూకర్ కుటుంబసభ్యుల సమక్షంలో క్షుణ్నంగా పరిశీలించారు.

మధూకర్ మృతదేహం లభ్యమైన చోటు నుంచి 150 మీటర్ల దూరంలో ముళ్లపోదలతో కూడిన కాలువలో క్లోరోఫైరిఫాస్ (500 ఎంఎల్) అనే పురుగుల మందు ఖాళీ బాటిల్‌తో పాటు ఒక మజా బాటిల్, కిన్లీ వాటార్ బాటిల్‌ను స్వాధీనం చేసుకోని, విచారణ నిమిత్తం సీజ్ చేసి తీసుకెళ్లారు. మధూకర్ చనిపోయిన ఇరువై రోజులైనా తర్వాత, అప్పటి వరకు మంథని పోలీసులు వెతికినా దోరకని పురుగుల మందు డబ్బా, నేడు విచారణాధికారిగా సింధూ శర్మ బాధ్యతలు చేపట్టి, విచారణ జరుపుతుండగా దోరకడంపై మధూకర్ కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎసిపి వెంట మంథని, రామగిరి ఎస్‌ఐలు ఉపేందర్‌రావు, శంకర్ తదితరులు ఉన్నారు.

గత కోన్నేళ్లు అధికారంలో ఉండి అటూ పది పోలీసు వాహనాలు, ఇటూ పది వాహనాల మధ్య తిరిగిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు నేడు పదవి కోల్పొవడంతో ఉండలేకపోతున్నాడని, మంథని ఎంఎల్‌ఎ కూర్చీపై కన్నెసిన శ్రీధర్‌బాబు, మంథని మధూకర్ అనుమానస్పద మృతి కేసును తనకు అనుకూలంగా మార్చుకోని, మర్మాంగాలు కోసి లేకున్నా కోసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించి, ఈ కేసును తనపై రద్దే ప్రయత్నాలు చేస్తున్నాడని మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తనపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేయడానికి నిరసనగా సోమవారం మంథనిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పుట్ట మధు మౌన దీక్ష అర గంట సేపు మౌన దీక్షలో కూర్చోన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మధూకర్‌ను చివరి సారీగా బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖానాపూర్ సర్పంచ్ ఓదెలు కోడుకేనని, మధూకర్ మృతి కేసులో వారి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నదని సదురు కాంగ్రెస్ నేతలనేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఆరెపల్లి మోహన్‌ను, వి. హనుమంతరావును పిలిపించి మధూకర్ మర్మాంగాలు కోశారని, అధికార పార్టీ పాలకుల హస్తం ఉందని, తప్పుడు ప్రచారం చేయించిన శ్రీధర్‌బాబు మర్మాంగాలు సరిగా ఉన్నట్లు నేడు పోలీసులు బయటపెట్టిన వీడియోపై ఏమీ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శ్రీధర్‌బాబు హయంలో మంథని నియోజకవర్గంలో అనేక మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు హత్య చేయబడ్డారని, వారి మరణాలు నేటికి మీస్టరీగానే ఉన్నాయని, ఆ మరణాలపై శ్రీధర్‌బాబు ఎందుకు స్పందించలేదన్నారు. మంథని మధూకర్ మృతిపై రీ పోస్టుమార్టం నిర్వహించి, నిజానిజాలు బయటకు తీసి, ఆ కేసులో నేను ఉన్నట్లు తేలిన నన్ను సైతం చట్టపరంగా శిక్షించాల్సిందేనని పుట్ట మధు స్పష్టం చేశారు. ఈ మౌన దీక్షలో మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఎంపిపి కమల, జడ్పిటిసి సరోజనల, వైస్ ఎంపిపి గట్టయ్య, తగరం శంకర్‌లాల్‌తో పాటు అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.