Home మంచిర్యాల అనుమానస్పదంగా యువకుడు మృతి

అనుమానస్పదంగా యువకుడు మృతి

The suspicious young man died
నస్పూర్‌: నస్పూర్ ప్రాంతానికి చెందిన శివగౌడ్ అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. వెంకాగౌడ్‌ భాగ్య దంపతుల కుమారుడు శివగౌడ్(21)  ఆదివారం ఉదయం ఇంటి నుండి బయలుదేరి ఇంటికి రాలేదని సోమవారం నస్పూర్ శివారు ప్రాంతంలో శవమై కనిపించినట్టు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శివగౌడ్ ఆదివారం ఇద్దరు యువకులతో కనిపించాడని, అదే వ్యక్తులు సాయంత్రం హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంచిర్యాల రూరల్ సిఐ ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.