Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లో హలెప్, స్టీఫెన్స్

 switzerland tiebreaker faced stiff competition from martens in the first set

మాంట్రియల్: మహిళల రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సమోనా హలెప్ (రుమేనియా), మూ డో సీడ్ స్లొవానె స్టీఫెన్స్ (అమెరికా) సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఐదో సీడ్ ఎలి నా స్విట్లొనా (ఉక్రెయిన్), 15వ సీడ్ సీడ్ ఆశ్లె బార్టీ (ఆస్ట్రేలియా) కూడా క్వార్టర్ ఫైనల్ పోరులో విజయం సాధించారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి హలెప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ క్రీడాకారిణి, ఆరో సీడ్ కరొలైన్ గార్సియాను ఓడించింది. హలెప్ ఈ మ్యాచ్‌లో 75, 61తో విజయం సాధించింది. తొలి సెట్‌లో హలెప్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న హలెప్ టైబ్రేకర్‌లో సె ట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో హలెప్‌కు ఎదురే లేకుండా పోయింది.

చూడచక్కని షాట్లతో అలరించిన హలెప్ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో ఐదో సీడ్ స్విట్లొనా 75, 63తో ఎలిసె మార్టెన్స్ (బెల్జియం)ను ఓడించింది. తొలి సెట్‌లో మార్టెన్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న స్విట్లొనా టైబ్రేకర్‌లో విజయం సాధించింది. ఇక, రెండో సెట్‌లో స్విట్లొనా ప్రారంభం నుంచే చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన స్విట్లొనా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ సమరంలో మూడో సీడ్ స్టీఫెన్స్ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో స్టీఫెన్స్ 62, 62తో లాత్వియా క్రీడాకారిణి సెవస్తొవాను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో బార్టీ 63, 63తో కికి బార్టెన్స్‌ను ఓడించింది.

ఎదురులేని నాదల్..
పురుషుల విభాగంలో అగ్రశ్రేణి ఆటగాడు రఫెల్ నాదల్ (స్పెయిన్) సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్రొయేషియా ఆటగాడు, ఆరో సీడ్ మారిన్ సిలిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 26, 64, 64తో సిలిక్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో సిలిక్ చెలరేగి ఆడాడు. నాదల్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. దూకుడైన షాట్లతో అలరించిన సిలిక్ అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే తర్వాతి సెట్‌లో నాదల్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. ప్రారంభం నుంచే అద్భుతంగా ఆడాడు. సిలిక్ కూడా గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ రెండు, మూడు సెట్లను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు జర్మనీకి చెందిన అగ్రశ్రేణి ఆటగాడు ఆండి జ్వరెవ్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. గ్రీస్ ఆటగాడు స్టెఫానోస్ 36, 76, 64 తేడాతో జ్వరెవ్‌పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్ సెమీస్‌కు చేరుకున్నాడు. నాలుగో సీడ్ అండర్సన్ 62, 62 తేడాతో ఐదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను చిత్తు చేశాడు.

Comments

comments