Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తుది జట్టుపై మాజీల తర్జనభర్జన

aswin
కుల్దీప్‌కు చోటివ్వాలంటూ సచిన్, అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న గంగూలి, గంభీర్

ముంబయి: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. టి20, వన్డే సిరీస్‌కు స్పిన్ వికెట్లను తయారు చేయడం, ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి, టెస్ట్ పిచ్‌లు స్లోబౌలర్లకు అనుకూలిస్తాయన్న చర్చ జరుగుతోంది. కాగా భారత తుది 11 మంది జట్టులో స్పిన్నర్లు ఎవరుండాలన్న విషయంపై మాజీ క్రికెటర్లు తల ఓ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్ ఉండాలని సచిన్ టెండూల్కర్ కోరుకుంటుండగా, యాదవ్ కన్నా అశ్విన్ మెరుగని మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు. 300 వికెట్లు తీసుకున్న అశ్వినే ఉత్తమ బౌలర్ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కన్నా అశ్వినే బెటరని గౌతమ్ గంభీర్ కూడా అభిప్రాయపడ్డాడు.

Comments

comments