Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ దేశానికే ఆదర్శం

The Telangana Ideal of the country

మన తెలంగాణ/ఖానాపూర్ : భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని, ప్రజల సంక్షేమంలో ఇతర రాష్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రూ.1 కోటితో నూతనంగా నిర్మించిన ఎంపిపి కార్యాలయ భవనం పూర్తి అయిన సందర్భంగా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని నిర్మల్ జిల్లా ఏర్పడిన తరువాత ఖానాపూర్‌ను రెండు మండలాలుగా చేయడం జరిగిందని, గతంలో ఖానాపూర్ ఒక మండలంలోని 18 గ్రామాలు ఉంటే, ఖానాపూర్,పెంబి మండలాలను చేసి 48 గ్రామాపంచాయతీలు చేశారన్నారు. గ్రామాల అభివృద్ధికి గూడేలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతన గ్రామపంచాయతీలకు పాలకవర్గం ఏర్పాటు అయిన తరువాత వారి గూడేలను వారే పాలించుకుంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయవంతం అయిందన్నారు. అలాగే భూమి ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయిస్తుందన్నారు. ఆగస్టు 15 నుండి రైతులందరికీ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని, రాబోవు ఎన్నికల్లో పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతకముందు మండల పరిషత్ కార్యాలయ భవాన్ని ప్రారంభించడానికి మంత్రి ఖానాపూర్‌కు రాగానే ఎంఎల్‌ఎ రేఖనాయక్‌తో పాటు ఎంపిపి ఆకుల శోభ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రేఖాశ్యాంనాయక్, రాష్ట్ర కార్యదర్శి సత్యానారాయణగౌడ్, పైడిపల్లి రవీందర్‌రావు, ఎంపిపి ఆకుల శోభరాణి, జడ్‌పిటిసి సునిత, తహసీల్ధార్ నరేందర్, ఎంపిడిఒ మల్లయ్య, యూసుఫ్‌ఖాన్, అంకం రాజేందర్, సత్యనారాయణ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments