Home రంగారెడ్డి ముప్పు ముంగిట జంట జలాశయాలు

ముప్పు ముంగిట జంట జలాశయాలు

reservoir-image

జి.ఓ 111ను తుంగలో తొక్కుతున్నా పట్టని అధికారులు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  జంట జలాశయాలకు ముప్పు ముంచుకొస్తుంది. హైద్రాబాద్ మహానగరానికి తాగునీటి అవసరాల కోసం నిజాం కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్‌లు అధికారుల నిర్లక్షంతో కాలుష్య కాసారాలుగా మారనున్నాయి. అనంతగిరి అడవుల నుంచి పారే మూసీ, ఈసి వాగుల నీరు ఎంతో మంచిదని, మూలిక వనాల నుం చి వచ్చే నీరు తాగడం వల్ల అరోగ్యంగా ఉండేవారని స్వయంగా సిఎం కెసిఆర్ పేర్కొన్నగా అధికారుల నిర్లక్షం మూలంగా గండిపేట్ నీరు మాకోద్దు బాబోయ్ అనే పరిస్థితులు త్వరలో రానున్నాయి. 1920లో 3.9 టిఎంసిల సామర్థ్ధంలో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్‌సాగర్ నిర్మించగా, ఏడో నిజాం చిన్న కుమారుడు హిమాయత్ అలీఖాన్ 1927లో 2.9 టియంసి సామర్థ్ధంతో హిమాయత్‌సాగర్ చెరువులను నిర్మించి హైద్రాబాద్ తాగునీటి అవసరాలను తీర్చారు. జంట నగరాలకు ప్రధాన తాగునీటి వనరులను రక్షించాలన్న లక్షంతో ప్రభుత్వం 1996 మార్చి 8న జి.ఓ 111 తీసుకువచ్చింది. జి.ఓ 111 ప్రకారం జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న 84 గ్రామాల పరిధిలో గ్రామ కంఠంలో తప్ప ఇతర ప్రాంతాలలో లేఆవుట్‌లు చేయరాదని, కాలుష్య కారక పరిశ్రమలను స్థాపించరాదని, పర్యావరణ సమతుల్యత దెబ్బతీసే చర్యలు చేపట్టకుండా అం క్షలు విధించింది. నీటి ప్రవాహంకు ఎక్కడ ఎలాంటి అడ్డంకులు నిర్మించరాదని స్పష్టంగా చెప్పుతు ంది. జి.ఓ 111 అమ లు చేయడంలో అధికారుల నిర్లక్షంపై పర్యావరణవేత్తలు పలుమార్లు కోర్టులు, జాతీయ గ్రీన్ ట్రి బ్యునల్‌ను ఆశ్రయించగా ప్రభుత్వ యంత్రాంగానికి కోర్టు చీవట్లు పెట్టిన అధికారులలో మాత్రం కనీసం మార్పు రావడం లేదు. పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా సాగుతున్న నిర్మాణాల నుంచి వెలువడే చెత్త చెదారంతో పాటు మురుగు నీరు సైతం జంట జలాశయాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు జరగడంతో పాటు వర్షం అధికంగా కురిస్తే మురుగు, చెత్తతో జంట జలాశయాలు మరో హూస్సేన్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జి.ఓ 111 అమలు చేయడంలో రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెతేతసింది. జంట జలా శయాలకు అనుకొని అక్రమ లేఆవుట్‌ల జాతర సాగుతున్న యథేచ్ఛగా బడా బడా నిర్మాణాలు వెలుస్తున్నా పంచాయతీ, హెచ్‌యండిఎ యంత్రాంగం మామూళ్ల మ త్తులో మునిగితేలుతు కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. హిమాయత్‌సాగర్ చెరువుకు ఎగువ ప్రాంతంలో 6 కి.మి దూరంలో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కోటి రూపాయ లతో బ్రిడ్జి నిర్మా ణం చేయడానికి శంకుస్థాపన చేస్తే దానిని అడ్డుకున్న జలమండలి అ ధికారులు గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల బఫర్‌జోన్‌కు అనుకొని బడా బడా విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తుంటే అధికారులు చో ద్యం చూస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. జి.ఓ 111 పరిధిలోని ఉన్న మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్, హి మాయత్‌నగర్, ఎన్కెపల్లి, చిల్కూర్, నాగిరెడ్డిగూ డం, బాకారం, సు రంగల్, మొయినాబాద్, పెద్దమంగళారం, చందానగర్, కనకమామి డి, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామంలో పదుల స ంఖ్యలో అక్రమాల జాతర సాగుతున్న జిల్లా పంచాయతీ అధికారులకు కనిపించడం లేదు. శంషాబాద్ మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జి.ఓ 111 అమ లు చేయడంలో చూపుతున్న నిర్లక్షంతో పంచాయ తీ, హెచ్‌యండిఎ, జలమండలి అధికారులు జంట జలాశయాలకు స మాధి కట్టడానికి సిద్ధం అవుతున్నారని ప్రభుత్వ పెద్దలు దీనిపై త గు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.