Home తాజా వార్తలు పెళ్లి సంబంధానికి వెళ్తూ ట్రాక్టర్ బోల్తా

పెళ్లి సంబంధానికి వెళ్తూ ట్రాక్టర్ బోల్తా

TRACTOR* ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్
మన తెలంగాణ/దేవరకద్ర : పెళ్లి సంబంధానికి వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అశోక్ వివరాల ప్రకారం పెళ్లి సంబంధానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో చిన్నచింతకుంట మండలం బండ్రపల్లి గ్రామానికి చెందిన కుర్వ రాములు కూతురి పెళ్లి సంబంధం విషయం మాట్లాడడానికి దేవరకద్ర మండలం అంజిలాపురం గ్రామానికి వెళ్తుండగా చౌరరిపల్లి సమీపంలో ప్రమాద వశాత్తు వెనుక లారీ వస్తున్నా సైడుకు తీసుకున్న ట్రాక్టర్‌ను సైడుకు తీసుకోవడంతో పక్కనే మట్టి రోడ్డు ఉండడంతో ట్రాక్టర్ మట్టిలో కూరుకుపోయి ప్రమాద వశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్‌లో ఉన్న 30 మందికి పైగా రెండు కిలోమీటర్లు అజిలాపురం చేరుకుంటామనే సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే బండ్రపల్లికి చెందిన రాములు (40) మృతి చెందాడని, 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయని ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. దీంతో బండ్రపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనను తెలుసుకున్న కలెక్టర్ రొనాల్డ్ రోస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రత్యేక చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.