Home జగిత్యాల ప్రగతి పథంలో జగిత్యాల జిల్లా

ప్రగతి పథంలో జగిత్యాల జిల్లా

Collector-Sharat

* వ్యక్తిగత మరుగుదొడ్లు, చేనేత లక్ష్మీలో రాష్ట్రంలోనే నెంబర్ వన్
* అందరి సహకారంతో అభివృద్ధిలో ముందడుగు
* జిల్లా కలెక్టర్ శరత్
జగిత్యాల: జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించిన ఐదు నెలల వ్యవధిలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శరత్ వివరించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎ క్కడా లేని విధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ద ప్రాతి పదికన చేపట్టి నిర్ధేశిత లక్షాన్ని సాధించామన్నారు. 90రోజుల్లో 6605 మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించి ఇప్పటి వరకు 57 వేల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచామన్నారు. జిల్లాలోని 14మండలా ల్లో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి అయ్యాయని, సారంగాపూర్ మండలంలో మాత్రం 60శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాయ న్నారు. ఈ మండలంలో వంద శాతం లక్షాన్ని సాధించేందుకు క్వి క్ ఆక్షన్ టీంను ఏర్పాటు చేసి లక్ష సాధనకు కృషి చేస్తున్నట్లు తెలి పారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.72కోట్లకు గాను ఇప్ప టికే రూ.50 కోట్ల చెల్లింపులు పూర్తి అయ్యాయని, మార్చి 31లోగా వంద శాతం లక్షాన్ని పూర్తి చేసి జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటిస్తామన్నారు.

చేనేత లక్ష్మీలో ప్రథమ స్థానం
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేయూతనిచ్చి వారిని పేదరికం నుంచి బయటపడవేయడానికి చేనేత లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. దీని క్రింద నెలకు రూ.500 చొప్పున 9 వాయిదాలు చె ల్లిస్తే పదవ వాయిదా చేనేత కార్పొరేషన్ చెల్లిస్తుందని, పది నెలల తర్వాత రూ.7200 విలువ గల వస్త్రాలు కొనుగోలు చేయవచ్చ న్నారు. ఇట్టి చేనేత లక్ష్మీ కార్డులను ఉద్యోగులు, వ్యాపారుల సహ కారంతో జిల్లాలో 4000 విక్రయించి, రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉన్నామన్నారు.

మిషన్ భగీరథ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారా రూ.1430కోట్లతో 482గ్రామాల్లోని 9.86 లక్షల జనాభాకు ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరాను చేపట్ట డానికి వివిధ రకాల పనులు ఈ నెలాఖరు నాటికి మొదటి దశ పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో 26 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు గాను 18 పూర్తి కాగా, మొదటి దశలో వెల్గటూర్ మండలంలోని 33 గ్రా మాలకు మండల కేంద్రం వద్ద 8 ఎంఎల్‌డి సామర్థంతో నిర్మించిన నీటి శుద్ది కేంద్రం ద్వారా మంచినీరు పనులు త్వరలో పూర్తికా నున్నాయ.

మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని 1226 చెరువులకు గాను మొదటి దశలో 197 చెరువుల మరమ్మతును పూర్తి చేశామన్నారు. రెండ వ దశలో 218 చెరువుల మరమ్మతులకుగాను ఇప్పటికే 97 పనులు పూర్తయ్యాయన్నారు. మిగులు పనులు మే నెలాఖరు కల్లా పూర్తి అ వుతాయన్నారు. మూడవ దశలో 180 చెరువుల పునరుద్ధరణ పను లకు గాను 172 పనులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో గొలుసుకట్టు చెరువులను అభివృద్ది చేసేందు కు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల జిల్లాలో 40వేల మంది ఉపాధి హా మీ కూలీలు పని చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో డంపింగ్ యార్డ్‌లు, వైకుంఠ దామాల నిర్మాణాలు, కుంటల పూడికతీత, కాంటూర్ కందకాలు, వర్మి కంపోస్టు బిట్లు, నర్సరీల నిర్వాహణ తదితర పనుల్లో ఉపాధి హామీ కూలీలను వినియో గించుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లాలో రూ.2616.5 లక్షల వ్యయంతో 327 గ్రామ పంచాయతీల్లో 557 సిసి రోడ్ల నిర్మాణ పనులు చే పట్టామన్నారు. 85 పనులు పూర్తి కాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నిధులు ల్యాప్స్ కాకుండా మార్చి 31లోగా ప్రతిపా దిత పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇ చ్చినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మూడు బిసి, నాలుగు ఎస్సీ, మూడు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని, వీటిలో ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచామన్నారు. మొత్తం రెసిడెన్షియల్ పాఠశాలలో 1020 సీట్లకు గాను 2800 దరఖాస్తులు వచ్చాయన్నారు. అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేసిన వారిలో మన జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింద న్నారు. 2016-17 సంవత్సరానికి గాను షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖ ద్వారా కార్యచరణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు tsobmms.cgg.in సైట్ నందు ఈ నెల 25 సాయంత్రం 5 గం టలలోగా ఆన్‌లైన్ చేసుకోవాలన్నారు.

జిల్లాలో జమీన్ బందీ కార్యక్రమానికి రూపకల్పన చేసి భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చొరవ చూపడం జరిగిందన్నారు. జ మీన్ బందీ ద్వారా జిల్లాలో 19169 ఆర్జీలు వచ్చాయని, వీటిని పరి శీలించి ఏప్రిల్ రెండవ వారంలోగా దరఖాస్తుదారులకు పరిష్కార పత్రాలు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత సాదా బైనామాలపై కొనుగోలు చేసిన వ్యవసాయ భూములకు ఉచితంగా క్రమబ ద్దీకరించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భా గంగా జిల్లాలో 55093 ఆర్జీలు వ చ్చాయని, వీటిని పరిశీలించి ని బంధనల మేరకు క్రమబద్దీకరణ ఉత్తర్వులను సిద్దం చేసి లబ్ధిదా రులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో అప్పటి కలెక్టర్ స్మితా సబ ర్వాల్ ప్రవేశపెట్టిన అమ్మలాలన కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్దరిం చేందుకు చర్యలు చేపట్టామ న్నారు. ఇందులో భాగంగా జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్ పెల్లి, ధర్మపురి ఆస్పత్రుల్లో అమ్మలాలన డెస్క్‌లను ఏర్పాటు చే శామన్నారు.

వంద శాతం గర్భిణీలను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రి లోనే ప్రసవం అయ్యేలా వైద్య సిబ్బంది చొరవ చూపుతున్నారన్నా రు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీల సంఖ్య 26 శాతం ఉండగా ప్రస్తుతం 58 శాతానికి చేరిం దన్నారు. ఇమ్యూనైజేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటికే 98.5 శాతం ఇమ్యూనైజేషన్ పూర్తి చేశామన్నారు. జిల్లాలోని పి హెచ్‌సిలతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి పనితీరు మెరుగైందని, ప్ర జలు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవల పట్ల ఆసక్తి చూపుతున్నారన్నా రు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అధికార యం త్రాంగంతో పాటు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ఇదే స హకారం ముందు ముందు కూడా కొనసాగించి జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, ఆర్‌డిఓ న రేందర్, తహసీల్ధార్లు మదుసూదన్, రాజ్‌మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.