Search
Sunday 18 November 2018
  • :
  • :

సుప్రీంకోర్టులో విజయ్ మాల్యా కేసు విచారణ

Vijay-Mallyaఢిల్లీ : కింగ్‌ఫిషర్ సంస్థ యజమాని విజయ్‌మాల్యా అప్పుల ఎగవేత కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రూ.4వేల కోట్లు చెల్లిస్తానన్న విజయ్‌మాల్యా ప్రతిపాదనను బ్యాంకర్లు తిరస్కరించారు. బకాయి ఉన్న తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు కోర్టుకు తెలిపారు. బకాయి మొత్తం డిపాజిట్ చేసిన అనంతరం మాల్యా వ్యక్తిగతంగా చర్చలు జరపొచ్చని బ్యాంకర్లు స్పష్టం చేశారు. బ్యాంకర్ల ప్రతిపాదనపై కింగ్‌ఫిషర్ యాజమాన్యం రెండు వారాల గడువు కోరింది. విదేశాల నుంచి మాల్యా ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టం చేయాలని ఆయన తరపు న్యాయవాదిని బ్యాంకర్లు ప్రశ్నించారు. ఎంతమొత్తం చెల్లించేది ఈనెల 21వ తేదీలోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. మాల్యా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను ఈనెల 21లోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. వివిధ బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్లు బకాయి పడిన విజయ్‌మాల్యా విదేశాలకు వెళ్లిపోయారు. దీనికి తోడు విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లోనే ఉండిపోయారు. విజయ్‌మాల్యా అప్పు ఎగవేత వ్యవహారం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Comments

comments