Home రాజన్న సిరిసిల్ల 8కిలోమీటర్ల దూరం చేరిన నీరు

8కిలోమీటర్ల దూరం చేరిన నీరు

mshn
సిరిసిల్ల: మూడు నియోజకవర్గాల్లో 446ఆవాసాలకు 8 లక్షల మంది ప్రజలకు నీటిని అందించేందుకు 1132 కోట్ల రూపాయలతో చేపడుతున్న సిరిసిల్ల మిషన్ భగీరథ పథకంలో శుక్రవారం చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సిరిసిల్ల, వేములవాడ,చొప్పదండి నియోజకవర్గాల్లో సురక్షిత నీటి సరఫరా కోసం ఉద్దేశించిన మిషన్ భగీరథ ట్రయల్న్ విజయవంతమైందన్నారు.శుక్రవారం రుద్రవరం గ్రామంలో నుంచి అగ్రహారం వరకు 8.825కిలోమీటర్ల దూరం ట్రయల్ రన్ విజయవంతమై నీరు అగ్రహారం చేరిందన్నారు. మూడు నియోజకవర్గాల్లోని 446 ఆవాసాలకు 8 ల క్షల మంది ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని ఏప్రిల్ లోగా అందిస్తామన్నా రు.దాదాపు పనులన్నీ పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. ట్ర యల్ ర న్ విజయవంతం కావడం సంతోషం కలిగిస్తుందన్నారు. మిషన్ భగీరథ కో సం మిడిల్ మానేరు ప్రాజెక్ట్‌లో ఐదు టిఎంసిల నీటిని నిల్వ చేశామన్నారు. అ వసరమైతే మరిన్ని నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఈ కా ర్యక్రమంలోఎస్‌ఇ శ్రీనివాసరావు,ఇఇ జ్ఞాన్‌కుమార్, డిఈఈ సురేశ్ పాల్గొన్నారు.