Home భద్రాద్రి కొత్తగూడెం పోడు సమస్యపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు

పోడు సమస్యపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు

The TRS government is tearing the poor out of the land

మన తెలంగాణ/కొత్తగూడెం టౌన్: పోడు సమస్య పరిష్కారంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అనాది గా సాగుచేసుకుంటున్న భూములను లాక్కుంటూ పేదలను కన్నీళ్ళు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు, కౌ లు సాగుదారులందరికి రైతు బంధు పథకం వర్తింప చే యాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొ ని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పేదలు పొట్ట పోసుకునేందుకు తప్ప కోట్లు సంపాదించేందుకు పోడు వ్యవసాయం చేయ డం లేదని అన్నారు. అడవులు అంతరించిపోవడంలో పో డు వ్యవసాయమే ప్రధాన కారణమని ప్రభుత్వం హరితహారం పేరుతో పేదలను ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. 2005కు పూర్వ నుంచి సాగు చేసుకుంటున్న భూ ములకు హక్కుపత్రాలు మంజూరు చేయకుండా సర్వేల తో కాలం వెళ్లదీస్తోందని, ఇలా హక్కు పత్రాలు లేని రైతు ల నుంచి భూములను తిరిగి లాక్కునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు కుట్రలు చేస్తున్నార ని ధ్వజమెత్తారు. జిల్లాలోని గట్టుమళ్ళ, రేగళ్ళ, మైలారం, పాండురంగాపురం తదితర ఏజెన్నీ గ్రామాలను లక్షంగా చేసుకొని పోడు రైతులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాగులో ఉన్న పోడు భూములకు, పోడు, అంబసత్రం భూ సాగుదారులకు  పట్టాలు మంజూరుచేసి రైతు బంధు చెక్కులు అందించాలని, ప్రభుత్వం ప్రకటించిన గిరిజన, దళిత, పేదలకు మూడు ఎకరాల భూ పంపిణీ పథకం తక్షణం అమలు చేయాలని, పోడు సాగుదారులపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.