Home వనపర్తి సింహగర్జన ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధ్దిచెప్తాం

సింహగర్జన ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధ్దిచెప్తాం

cong

మన తెలంగాణ/కొత్తకోట: ఈనెల 4న వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహిం చ నున్న సింహ గర్జన సభ ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వం విర్ర వీగుడు తనానికి బుద్దిచెప్తామని మండల కాం గ్రెస్ అధ్యక్షులు ఉమామహేశ్వర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు ఎంజె.బోయేజ్, పాపా యగారి కృష్ణారెడ్డి, రాచాల తిరు పతయ్య,పెంటన్న యాదవ్‌లు అన్నారు. సింహగర్జన పోస్ట ర్లను కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో ఆవిష్కరించారు. అనంతరంవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉధ్యమంతో ఏర్పడిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాల్గున్నర సంవ త్సరాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక వీధుల్లో తిరుగు తున్నారనివారన్నారు .నిరు పేద ప్రజలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయక పోవడంతో ప్రజలు అయో మయంలో పడ్డారన్నారు. కార్యక్రమంలో ముంత సాయిల్ యాదవ్, సుభాష్, శాంతన్న ముదిరాజ్,అశోక్,నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.