Home తాజా వార్తలు సెల్యూట్ మహేంద్రుడా..!(వీడియో)

సెల్యూట్ మహేంద్రుడా..!(వీడియో)

MS Dhoniహామిల్టన్: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ తన దేశభక్తిని చాటుకున్నాడు. అసలేం జరిగిందంటే… కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి దూసుకొచ్చాడు. వచ్చి రావడంతోనే మహేంద్రుడి కాళ్లకు పాదాభివందనం చేశాడు. అయితే ఆ సమయంలో సదరు అభిమాని తన చేతిలో జాతీయ జెండా పట్టుకున్నాడు. ధోనీకి పాదాభివందనం చేసే క్రమంలో అతడి చేతిలో ఉన్న  జాతీయ జెండా నేలను తాకబోయింది. దాంతో వెంటనే ఇది గమనించిన మహీ జాతీయ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనంతరం ఆ అభిమానిని పక్కకు జరిపి పైకి లేపాడు. సమయస్పూర్తితో ధోనీ జాతీయ పతాకాన్ని నేలకు తాకకుండా దాని గౌరవాన్ని కాపాడి అందరీ మన్ననలు పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డుకావడం.. అవి కాస్తా బయటకు రావడంతో మహేంద్రుడి దేశభక్తిని అందరూ కొనియాడుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ లో ధోనీ చేసిన ఓ స్టంపౌట్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. రెప్పపాటులో వికెట్లు గిరాటేసి ఔరా అనిపించాడు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.

The True Patriot of Mahendra Singh Dhoni