Search
Thursday 20 September 2018
  • :
  • :

రద్దుకే నిర్ణయం

h4

హెచ్4 వీసాలపై ట్రంప్ ప్రభుత్వం 

వాషింగ్టన్: హెచ్ 1బి వీసాలపై అమెరికా వెళ్లే విదేశీ వృత్తి నిపుణుల భార్యలు అక్కడ పని చేయడానికి వీలు కల్పించే హెచ్ 4 వీసా నిబంధనను రద్దుచేయడానికే నిర్ణయించుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది.  ఈ ప్రతిపాదన గనుక అమలయితే అమెరికాలో పని చేస్తున్న వేలాది మంది భారతీయ  ఐటి నిపుణుల భార్యలకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం హెచ్ 1బి వీసా విధానాన్ని సమీక్షిస్తోంది.  అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను  నియమించుకోవడం కోసం కంపెనీలు  హెచ్1బి వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. భారతీయలు ఎక్కువగా ఈ వీసాలపైనే అమెరికా వెళ్తుంటారు. ‘ఎంప్లాయ్‌మెంట్  ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఇఎడి)కు అర్హుల జాబితానుంచి హెచ్4 వీసాలను తొలగించడానికి ప్రతిపాదించాం’అని ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్‌లో అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలియజేసింది. ఈ నిర్ణయం ఒబామా ప్రభుత్వ హయాంలో ఎక్కువ లబ్ధి పొందిన భారతీయ మహిళలలపే తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. దీనికి సంబంధించిన నోటీసును ఈ నెలలోనూ ప్రకటించనున్నట్లు ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్ తెలియ జేసింది. అయితే దీనిపై  అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం స్పందిస్తూ  రూల్ మేకింగ్ (చట్ట తయారీ) ప్రక్రియ )పూర్తయ్యే వరకు  హెచ్4 వీసాలపై  ఏదీ తుది నిర్ణయం కాదని పేర్కొంది. ప్రతిపాదిత చట్టం నోటీసును  ప్రజల  సూచనలు, సలహాల కోసం  అభిప్రాయాలకోసం ఉంచినప్పుడు ఈ విభాగం వారిని అప్రమత్తం చేస్తుంది. ప్రజల సూచనలు, సలహాలను పరిశీలించిన తర్వాత తుది రూల్‌ను తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఇదిలా ఉండగా అమెరికా గ్రీన్‌కార్డు పొందడం కోసం ఏళ తరబడిగా ఎదురు చూస్తున్న పలువురు భారతీయ అమెరికన్లు న్యూయార్క్‌లోని అల్‌బానీలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు సౌల్ టోంకోను కలిసి గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌ను వీలయినంత త్వరగా పరిష్కరించాలని, ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ రిజిస్ట్రీ నుంచిహెచ్4ను తొలగించవద్దని కోరారు. గ్రీన్ కార్డులపై ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగ అనుమతులను రద్దు చేయడం వల్ల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారినుద్దేశించి ప్రసంగించిన గ్రీన్‌కార్డుల సమస్యలపే పోరాటం చేస్తున్న రేణుకా రాజ్‌కుమార్ తెలిపారు.

Comments

comments