Home హైదరాబాద్ వరద ప్రవాహానికి ‘ప్లాస్టిక్’ అడ్డు

వరద ప్రవాహానికి ‘ప్లాస్టిక్’ అడ్డు

The use of plastic covers is more than one crore per day in Greater

గ్రేటర్‌లో రోజుకు కోటి పైగానే ప్లాస్టిక్ కవర్ల వినియోగం
ఉప్పొంగుతున్న నాలాలు, డ్రైనేజీలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
ప్రతి ఏటా ఇవ్వే తంటాలు  

మన తెలంగాణ/సిటీబ్యూరో: మహానగరానికి ప్లాస్టిక్‌తో పెను ముంపు ముప్పు పొంచి ఉంది. ఒకేసారి వడి పాడేసే ప్లాస్టిక్ కవ ర్లు నాలాలు, వర్షపు నీటి డ్రెయిన్లలో వరదనీటి ప్రవహానికి అడుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్ల కా రణంగా ప్రతి ఏటా నగరంలో వ రదలు ముంచ్చెత్తుతున్నాయి. వ దరలు ముచ్చెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదల సమస్యలను నగర వాసులకు ఎదురవుతున్నాయి. అయితే ఈ విషయంలో ముంబాయి మహానగరం ఖచ్చితమైన నిర్ణయంతో ముందడుగు వేసింది. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌తో ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించడంలో విజయవంతమైంది. పౌరులు కూడా ప్లాస్టిక్ నిషేదాన్ని క్రమశిక్షణతో ఖచ్చితంగా పాటించారు. పర్యవసనంగా ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంబా యి నగరాన్ని చుట్టు ముట్టాయి. అయితే గతంలో ఎదురైన సమస్యలు ఈ దఫా పునరావృతం కాలేదు. గతంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంతో ఉండటంతో నా లాలు, డ్రెయిన్‌లలో ప్లాస్టిక్ ముద్దగా మారి వరద నీటి ప్రవహాన్ని అడ్డుకునేది. ప్ర స్తుతం వరదల్లో ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదని ముంబాయి నగర వాసు లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ కవర్ల నిషేదం కొత్తలో కొంత కష్టంగా మారినా, పర్యావరణం, వరదల ముంపును దృష్టిలో పెట్టుకొని అమల్లో భాగస్వా మ్యం అయ్యామని అన్నారు. ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ మహామ్మరిని తరిమికోట్టింది. హైదరాబాద్‌లో కూడా ప్లాస్టిక్‌ను నిరోదిస్తేనే వరదల ముంపు నుంచి బయటపడోచ్చని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నగర వాసుల భాగస్వామ్యంతో పాటు ప్లాస్టిక్ నిషేదాన్ని ఖచ్చితంగా అమలు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.

పూడికలో 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే
నాలాల పూడికతీతను జిహెచ్‌ఎంసి ఏడాది మొత్తం చేపడుతుంది. ఈ సంవత్సరం మొదటి దశలో చేపట్టిన పూడితకతీతలో 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే వచ్చాయని జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్(నిర్వహణ) జియాఉద్దీన్ తెలిపారు. 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు, గడ్డి, ఇతర వస్తువులు పూడికలో వస్తాయి. రెండవ దశ పూడికతీతలోనే నీటి కింద ఉన్న పూడిక మట్టిని తొలగిస్తారు. ఇలా నగరంలో దశల వా రిగా పూడికతీత పనులు చేపట్టుతున్నారు. వర్షపు నీటి పారుదలకు ప్లాస్టిక్ వ్య ర్థాలు ప్రధాన అడ్డాంకిగా మారాయి. నగరంలో 384 ప్రధాన నాలాలు, 837 మైనర్ నాలాలు, 1221 అంతర్గత వర్షపు నీటి డ్రెయిన్లు ఉన్నాయి. వీటి ద్వారా నే నగరంలో వరద నీరు బయటకు వెళ్లుతుంది. ఒకేసారి వడిపాడేసే ప్లాస్టిక్ కవర్లతో పాటు తర్మకోల్, నీటిలో కొట్టుకపోయ్యే ప్లాస్టిక్ వస్తువులతో వరదనీటి ప్రవహానికి అడ్డుతగులుతున్నాయి. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు నగరాన్ని ముచ్చెత్తాయి. అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ నివేధికవరదలకు ప్లాస్టిక్ కూడా కారణమని స్పష్టం చేసింది. వర్షపు నీటి డ్రెయిన్లు రోడ్డు దాటే ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చిక్కుకుంటే, తొలగించడంలో ఇబ్బంది కారమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన వస్తోంది. గత సంవత్సరం బయోడైవర్సిటీ దగ్గర ఇలాంటి అనుభవమే ఎదురైంది. కల్వర్టర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ముసుకపోవడంతో వరద నీరు పోటెత్తింది. రాకపోకలు స్తంభించిపోయాయి. విపరితమైన ట్రాఫిక్ సమస్య తలెత్తిం ది. దాదాపు వారం రోజుల పాటు శ్రమించిన అనంతరం పైప్‌లలో చిక్కుకున్న ప్లాస్టిక్‌ను తొలగించారు. ప్లాస్టిక్ పూడికను తొలగించేందుకు రోడ్డు మధ్యలో త వ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు గత సంవత్సరం సుమారు 15 ప్రాంతా ల్లో ఎదురయ్యాయి. ఈ ప్రాంతాల్లో భవిష్యత్‌లో సమస్యలు ఉత్పత్తనం కాకుండా ఉండేందుకు బాక్స్ డ్రెయిన్లను నిర్మిస్తున్నారు. ఇవ్వికూడా తత్కాలిక ఉపశమనమేనని పర్యావరణ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు కోటి ప్లాస్టిక్ కవర్ల వినియోగం
మహానగరంలో ప్రతి రోజు కోటికి పైగానే ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని జిహెచ్‌ఎంసి అంచనగా ఉంది. వీటిలో దాదాపు 70 శాతం ఒకేసారి వాడే ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ వాటర్, కూల్‌డ్రిక్, పాల పాకేట్లు, ఇతర వస్తువులను కూడా ప్లాస్టిక్ కవర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లతోనే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. తక్కువ మందం ఉన్న కవర్లు ఒకదానికి ఒకటి చుట్టుకపోయి, సిమెంట్ క న్నా గట్టిగా ముద్దగా మారుతాయి. అలాగే కవర్లలో పాడేసే వస్తువులను గట్టి, క ట్టి పారేస్తుంటారు. ఇలాంటివన్నింటితోనే వరద నీటి ప్రవహానికి అడ్డుకుంటా యి. నాలాలు, వర్షపు నీటి డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు చిక్కుకపోవడంతో వర్షా లు వచ్చినప్పుడు వరదనీరు వెనక్కు నెట్టివేయడంతో ముంపునకు కారణమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీరు సాఫిగా పారేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేస్తే వరద ముంపు రాకుండా ఉంటుందని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేదంలో ముంబాయి మహానగరం అవలంభించిన విధానాలు ఇక్కడ అమలు చేస్తే ప్లాస్టిక్ నిషేదం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పౌరులను స్థాయిలో భాగస్వామ్యం చేయడం ద్వారా అక్కడ ప్లా స్టిక్ నిషేదం పూర్తి స్థాయిలో సాధ్యమైందని జియాఉద్దీన్ అన్నారు.