Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రూపాయి దారెటు?

bs

గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే రూపాయి విలువ గణనీయంగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2018 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 శాతం క్షీణించింది. గత కొద్ది వారాలుగా చూస్తే ఈ పతనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన కరెన్సీ ఏడాది కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అయితే కరెన్సీ విలువ పడిపోవడం భారత్‌లోనే కాదు.. ఇతర వర్ధమాన దేశాల్లోనూ ఉంది. ఇండోనేషియా, అర్జెంటీనా, మెక్సికో, టర్కీ వంటి దేశాల్లోనూ కరెన్సీ విలువ పతనం కొనసాగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయాల వల్ల  కరెన్సీ విలువ పడిపోతోంది.

మన తెలంగాణ/బిజినెస్ డెస్క్: చెందుతున్న దేశాల్లో కరెన్సీ విలువ క్షీణించడంలో అంతర్జాతీయ పరిణామాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వచ్చే నెలల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు మోనెటరీ పాలసీని మరింత కఠిన చేయనుందనే అంచనాలు ఉన్నాయి. అమెరికా ద్రవ్య లభ్యతలో వృద్ధి మందగమనం నేపథ్యంలో చర్యలు చేపట్టేందుకు ఫెడ్ సిద్ధమైంది. కరెన్సీ విక్రయాలకు దారితీయడానికి ప్రధానం కారణం ఇదే. అమెరికా ద్రవ్య లభ్యత వృద్ధిలో మందగమనం.. రెండు మార్గాల్లో ఇతర దేశాల కరెన్సీ విలువలపై ప్రభావం చూపుతోంది. ఒకటి.. వివిధ ఆస్తుల నాణ్యత పడిపోతుందనే ఆందోళనతో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఫెడరల్ రిజర్వు ద్రవ్య విధానాలు మరింత దూకుడుగా ఉండడంతో.. పదేళ్ల అమెరికా బాండ్లపై లాభాలు గతేడాదిలో 2 శాతం నుంచి 3 శాతానికి పెరిగాయి. ఈ కారణాలతో ప్రపంచంలో ఇతర భాగాల్లో తమ ఆస్తులను ఇన్వెస్టర్లు విక్రయించడం పెరిగింది. ఈ పరిణామాలతో వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు పెరగడం వంటి పరిణామాలతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై అమ్మకాల ఒత్తిడి పెరగ్గా, డాలర్ కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. రెండోది.. ద్రవ్య లభ్యత, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ లభ్యతపై ఫెడ్ మరింత కఠినంగా వ్యవహరించడం ఆందోళన కల్గిస్తోంది. ఇది ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు కారణాలు ట్రేడర్లపై ప్రభావం చూపుతున్నాయి. ట్రేడర్లు ఫ్యూచర్ రిటైల్ డిమాండ్‌పై అంచనాల నేపథ్యంలో ఇతర దేశాల కరెన్సీలతో డాలర్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
కొనుగోలుదారులు డాలర్‌ను తీసుకునేందుకు మరింతగా రూపాయిలను కేటాయించడంతో.. రూపాయి విలువ పతనమవుతోంది. కరెన్సీ నమూనా విలువలో పతనం మరింత దారుణంగా ఉందని దాని హోల్డర్లు సూచించడం లేదు. కరెన్సీతో కొనుగోలు చేసిన డాలర్ల వాస్తవ విలువ సమర్థవంతంగా పెరిగినట్లయితే.. వాటి కొనుగోలు శక్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. రూపాయిపై ఇన్వెస్టర్ల వైఖరిలో ప్రాథమిక మార్పు వల్ల భారత్ కరెన్సీ విలువ క్షీణిస్తోంది. కావున రూపాయి వాస్తవ కొనుగోలు శక్తిలో పతనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు వర్ధమాన దేశాల మార్కెట్లు లేదా రూపాయి విలువ క్షీణత అనూహ్యంగా జరగ్గా.. ఇది వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి లాభాలపై ప్రభావం చూపింది. అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన వారికి డాలర్ పటిష్టత సానుకూలంగా మారనుంది. అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లపై బుల్లిష్‌గా ఇన్వెస్టర్ల లాభాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఏం జరుగుతుంది?
కరెన్సీ మారకం విలువను నిర్ణయించే ప్రధాన కారకం ఇతర దేశాలలో దానికి సంబంధించిన కొరతగా చెప్పవచ్చు. జాతీయ కరెన్సీల లభ్యత ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి ఉంటుంది.. ఈ సంస్థ సరఫరాను ని యంత్రించి కరెన్సీ విలువను ప్రభావితం చేస్తుంది. కరెన్సీ మారకం విలువను ప్రభావితం చేస్తే మరో కారకం బెంచ్‌మార్క్ వడ్డీ రేటు.. ఇది దేశంలో పెట్టుబడులను ప్రత్యక్షం గా ఆకర్షించే ఉపకరణంగా చెబుతారు. మోనెటరీ పాలసీ విధానాల ద్వారా ఏకకాలంలో ద్రవ్య లభ్యత, దేశీయ వడ్డీ రేట్లు.. రెండింటిపైనా ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాం క్) ప్రభావం చూపించగలదు. కరెన్సీ నియంత్రణకు మరో సాధారణ మార్గం కూడా ఉంది. ఫారెక్స్ మార్కెట్ లో సెంట్రల్ బ్యాంక్ ప్రత్యక్ష జోక్యం చేసుకోవడం ద్వారా కరెన్సీని కట్టడి చేయవచ్చు.
వచ్చే రోజుల్లో ఎలా ఉంటుంది?
గత వారాంతం శుక్రవారం డాలర్‌పై రూపాయి నిలకడ గా ఉంది. క్రితం రోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలు వ 0.02 శాతం పతనమైంది. అంటే 67.32 నుంచి 67.33కు చేరింది. మొత్తానికి కొద్ది రోజులుగా రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడం ఇన్వెస్టర్లకు ఆందోళన కల్గిస్తోం ది. కొద్ది రోజుల క్రితం కీలక మద్దతు 65.35 స్థాయిని కూడా కోల్పోయింది. వర్ధమాన దేశాల కరెన్సీల్లో అత్యంత అధ్వాన్న ప్రదర్శన జరిపిన కరెన్సీగా రూపాయి నిలిచిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సాంకేతికంగా, ఆర్థికంగా రూపాయి భవిష్యత్ ఆశాజనకంగా లేదని.. మ రోవైపు ఇదే సమయంలో చమురు ధరలు నానాటికీ పుం జుకోవడం పరిస్థితిని మరింత క్షీణింపజేస్తోందని అంటున్నారు. ఇరాన్‌పై ఆంక్షల ప్రభావం భారత్‌పై, రూపాయి పై మరింత ఒత్తిడి తెస్తుందని చెబుతున్నారు. మరోవైపు క్రూడాయిల్ ధర పెరగడం, ఎగుమతులు మందగించడం వంటి పరిణామాలు వాణిజ్యలోటును పెంచుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ లోటు 9000 కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం ద్రవ్యోల్బణం గణాంకాలు, కర్నాటక ఎన్నికల ఫలితాలు కూడా దేశీయ కరెన్సీని ప్రభావితం చేయనున్నాయి.

Comments

comments