Home నాగర్ కర్నూల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

The village is ideally designed

మన తెలంగాణ/తెల్కపల్లి: ఆలేరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో నూతనంగా రూ. 16 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ ఆరవణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, తెలుగుతల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని గ్రామం గత నాలుగేళ్లలో రూ.4 కోట్లతో గ్రామాభివృద్ధి జరిగిందన్నారు. రూ.3 కోట్లతో 14 చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టామని, కెఎల్‌ఐ ద్వారా నీళ్లు నింపామని, రూ. కోటితో గ్రామంలో సిసిరోడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నిరంతరం 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. రెండు నెలల్లో ఇంటింటికి నీరు అందేలా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. సభలో మాట్లాడుతున్న గ్రామ ప్రజలు ఆలేరు నుంచి ఒట్టిపల్లికి వేళ్లే రోడ్డును మంజూరు చేయాలని అడుగగా దానిపైహామీ ఇచ్చారు. అంతకుముందు గౌరెడ్డిపల్లిలో మత్సకార్మికుల సంఘం భవనానికి రూ.5 లక్షలతో పనులకు భూమి పూజ చేశారు. 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి నరేందర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎంపిటిసి నారాయణరావు, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు హన్మంతరావు, రమణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.