Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మన తెలంగాణ కథనానికి స్పందన: గ్రామ సర్పంచ్

village sarpanch mud on the road

రేగోడ్ : రోడ్డుపై వరినాట్లతో నిరసన అనే కథనం జూలై 17న మన తెలంగాణలో ప్రచురితం కావడంతో స్పందించిన సిందోల్ గ్రామ సర్పంచ్ యాదగిరి తన స్వంత నిధులతో లింగంపల్లి నుండి సిందోల్ వరకు మొరం వేయించారు. దీంతో సిందోల్, లింగంపల్లి గ్రామస్తులు, ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణతో సర్పంచ్ మాట్లాడుతూ… లింగంపల్లి నుండి సిందోల్ వరకు రోడ్డు వేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు విన్నవించుకున్నామని, గ్రామస్తులందరం కలిసి పలుమార్లు ఎంఎల్ఎ బాబుమోహన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. గ్రామస్తులు పడుతున్న అవస్థలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించి ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా తన స్వంత నిధులతో రోడ్డుపై మొరం వేయించినట్లు సర్పంచ్ యాదగిరి తెలిపారు.

Comments

comments