Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘భరత్ విజన్’ వండర్‌పుల్…(టీజర్)

Mahesh-Bharat-Vision

హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబొలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. మంగళవారం చిత్ర యూనిట్ ‘ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. శ్రీమంతుడు వంటి భారీ హిట్ చిత్రం తర్వాత మహేష్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ‘భరత్ అనే నేను’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ‘విజన్ ఆఫ్ భరత్’తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ ను మరింత స్టైలిష్ గా చూపించాడు కొరటాల.  స్టైలిష్ ముఖ్యమంత్రిగా ప్రిన్స్ అదరగొట్టాడు. టీజర్ లో మహేష్ పలికి డైలాగులు కూడా చాలా బాగున్నాయి. దీంతో మహేష్ బాబు, కొరటాల ఖాతాలో మరో విజయం చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే  ప్రస్తుత విద్యా విధానంలో ఓ యంగ్ సిఎం ఎలాంటి మార్పులు తీసుకువచ్చాడనేది ఈ మూవీ మెయిన్ పాయింట్ అని టాలీవుడ్ సర్కిళ్ల సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు.  ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments