Search
Saturday 22 September 2018
  • :
  • :

తిమింగలం కడుపులో 8 కిలోల ప్లాస్టిక్

ti

బ్యాంకాక్: ప్లాస్టిక్ భూతం  తిమింగలాన్ని చంపేసింది. థాయీలాండ్‌లోని సొంగ్లాకా ప్రాంతంలో కాలువలో  కదలలేని స్థితిలో పడి ఉన్న తిమింగలాన్ని నావిక దళం వారు కనుగొన్నారు. దీనిని రక్షించేందుకు ఐదు రోజుల పాటు పశువైద్య బృందం విశేష రీతిలో యత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. చనిపోయిన తరువాత దాని శరీరంలో మొత్తం ఎనిమిది కిలోల బరువు తూగే 80 ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఉన్నట్లు నిర్థారించారు. బ్యాగ్‌లే కాకుండా ఇతర ప్లాస్టిక్ వస్తువులు కూడా కనుగొన్నారు. సాధారణంగా తిమింగలాలు చిన్న చేపలు, ఇతర జలచరాలను, కొన్ని అక్టోపస్‌లను వేటాడి తింటాయి. అయితే అవి అందుబాటులో లేనప్పుడు ఆహారంతో కూడిన ప్లాస్టిక్ కవర్లను తిమింగలాలు కడుపులోకి తీసుకోవడం ప్రాణాంతకం అవుతోందని తీర ప్రాంత వనరుల విభాగం తమ వెబ్‌సైట్‌లో తెలిపింది. తీర ప్రాంతాల వద్ద సందర్శకులు ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చేయాలని, ఈ నెల 8న ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్లాస్టిక్ సమస్యపై ప్రజలలో చైతన్యం కల్పించాలని తిమింగలాల సంరక్షణ బృందం సంకల్పించింది.

Comments

comments