Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

The wife committed suicide with her husband's harassment

మామడ: మండలంలోని గాయిద్‌పెల్లి గ్రామానికి చెందిన రాథోడ్ రాధిక(28) ఆదివారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రాంనర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గాయిద్‌పెల్లి గ్రామానికి చెందిన రాజుకు నేరెడిగొండ మండలంలోని పట్‌పట్ తాండకు చెందిన రాధికతో 7 సంత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొన్నాళ్ల నుండి వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కొంత కాలం క్రితం రాజు తన భార్యను కొట్టి పుట్టింటికి పంపగా గాయిద్‌పెల్లి గ్రామస్తులు ఇద్దరికి నచ్చజెప్పిగా గొడువ సద్దుమనిగింది. ఇది ఇలా ఉండగా రాధోడ్ రాధికను భర్త రాజుతో పాటు ఆడపడుచు, రాజు చెళ్లి అయిన జాదవ్, సుగుణ, అమర్‌సింగ్, వీరు మూగ్గురు రాధికను మానసికంగా, శారీరకంగా హింసించడం ద్వారా మనస్థపానికి గురైన రాధిక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. రాధిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Comments

comments