Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భర్త కొట్టాడని మహిళ ఆత్మహత్య

women-sucide

పెద్దపల్లి : డబ్బుల విషయంలో చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో కోపోద్రిక్తుడయిన భర్త కట్టుకున్న భార్యను చితక బాదడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని హన్మంతుని పేట గ్రామానికి చెందిన నాయిని స్రవంతి ఇంట్లో దాచిన డబ్బులను వృధా ఖర్చు చేశాడనే నెపంతో భర్త నాయిని రవి చితక బాదడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Comments

comments