Home నిర్మల్ వడదెబ్బతో మహిళమృతి

వడదెబ్బతో మహిళమృతి

woman-dead-imageమన తెలంగాణ/సిర్పూర్: ఏజెన్సిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పచ్చని కొండలకు నిలయమైన గిరిజన ప్రాంతాల్లో కూడా గతవారం రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో పల్లె జనం బేజారౌతోంది. ఎండలకు తాళలేక సిర్పూర్ మండలం పాములవాడకు చెందిన  గిరిజన మహిళమృతి చెందినటు గురువారం తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ శంకర్ తెలిపారు. ఉన్నట్లుండి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని పలువురు పరమర్శించారు. ఇదిలా ఉంటే గతంలో  ఎన్నాడు   లేని విధంగా ఎండలుండటంతో ఏ పనులు చేసుకోలేక పరేషాన్ అవుతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడి ప్రతాపంతో ఇళ్ళనుండి బయటకు వెళ్ళేందుకు ఎవ్వరు సహసించడం లేదు. మరోవైపు గ్రామల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పల్లెవాసులు కోరుతున్నారు.