Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పాతబస్తీలో దారుణం…

The woman is dead in the bag

చార్మినార్: పాతబస్తీ డబీర్‌పురాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళను దారుణంగా హత్యచేసి సంచిలో బందించి రైల్వే ట్రాక్ సమీపంలో పడవేసిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డబీర్‌పురా రైల్వే ట్రాక్ సమీపంలో ప్యాకింగ్ టేప్ చుట్టి ఉన్న ఒక సంచి కనిపించాడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ సంచిని విప్పి చూడగా దారుణ హత్యకు గురైన ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ విషయం స్థానికంగా వ్యాపించటంతో జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మహిళను చంపి సంచిలో మూటకట్టటంపై విచారం వ్యక్తం చేశారు. హత్యకు గురైన మహిళ డబీరపురా ఫర్హత్‌నగర్‌కు చెందిన జెబానా (30)గా గుర్తించారు. స్థానికంగా విచారించగా పదేళ్ళ క్రిందట  హైదర్‌తో వివాహం జరిగింది. ఇతడు త్రాగుబోతు, రెండేళ్ళ క్రితం దుబాయ్‌కి వెళ్ళి గత వారం క్రిందట నగరానికి వచ్చిన ఆయన కింగ్‌కోఠిలోని వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆమెను డబీర్‌పురాకు తీసుకువచ్చాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్యచేసి ఒక ప్లాస్టిక్ సంచిలోకి దూర్చి ప్యాకింగ్ టేప్‌తో గట్టిగా ప్యాక్ చేశాడు. ఆ పార్సల్‌ను డబీర్‌పురా ట్రాక్ వద్ద వదిలేసి వెళ్ళాడు. పోలీసులు మహిళ ఆచూకి ఆధారంగా వారి ఇంటికి వెళ్ళి చూడగా తాళం వేసి ఉంది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో, మహిళ హత్య వెనుక భర్త హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాల సహాయంతో భర్త, పిల్లల ఆచూకి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా సిసి ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Comments

comments