Home కరీంనగర్ బ్రతుకుదెరువు కోసం వచ్చి.. కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి

బ్రతుకుదెరువు కోసం వచ్చి.. కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి

The worker died the accident occurred fall on the bags
ఫర్టిలైజర్‌సిటీ: స్థానిక గౌతమినగర్‌లోని శ్రీసాయిపారా రైస్‌మిల్ జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలోకి వెళ్లితే శ్రీసాయిపారా రైస్‌మిల్‌లో పని చేస్తున్న టెంట్ కుమార సదా అనే కార్మికుడిపై ప్రమాదవశాత్తు వడ్ల బస్తాలు మీద పడడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు. బీహార్ నుండి ఉపాధి కోసం వచ్చిన కుమార సదా గత మూడు సంవత్సరాల నుండి రైస్‌మిల్‌లో పనిచేస్తున్నాడు. కుమార సదా ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైయ్యారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.