Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన సంస్కృతి భారతీయులదే

stage

మనతెలంగాణ/జగిత్యాలటౌన్ : ప్రపంచంలోనే అ త్యంత శ్రేష్టమైన సంస్కృతి భారతీయులదేనని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సహా కార్యవాహా లింగం శ్రీధర్‌జీ అన్నా రు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని శ్రీ సీతారామంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఉ గాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీధర్‌జీ మాట్లాడుతూ భారతీయ ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాల్లో కెల్లా గొప్పదని, వేలాది సంవత్సరాలుగా విదేశీ దాడులకు గురైనప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలుగా చెప్పబడే ఈజిప్టు, రోమ్ జాతులు కనుమరుగయ్యాయన్నారు. గ్రీకులు,హునులు, హుషానులు, డచ్, పోర్చుగీసు, ఆంగ్లేయులు దండెత్తి భారతీయ సంస్కృతిని నాశనం చేయాలని చూసినప్పటికీ వాటన్నింటిని తట్టుకుని ఇంకా తలెత్తుకుని జీవిస్తున్న జాతి ప్రపంచంలో భారత జాతి మాత్రమేనన్నారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న హిందు ధర్మాన్ని ఎవరూ ప్రారంభించారో తెలియదని, అందుకే దీనిని సనాతన ధర్మమని, దీనిని భగవంతుడే ప్రారంభించాడని భావిస్తున్నామన్నారు. అత్యంత పురాతన జాతి అని చెప్పుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల భారత్, శ్రీలంకల మధ్య ఉన్న వారధిని మానవ నిర్మిత వారధిగా గుర్తించిందని, అదే మనం శ్రీరాముడు నిర్మించిన వారధిగా చెప్పుకుంటున్నామన్నారు. ఉగాది అంటే యుగ ఆరంభమని, కలియుగం ప్రారంభమై నేటికి 5140 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. భారతీయ ఋషులు, మునులు కాల గమనాన్ని, గ్రహ గమనాన్ని ఖచ్చితంగా లెక్క వేసి పండుగలను నిర్ణయించారన్నారు. ప్రకృతిలో జరిగే మార్పుల ఆధారంగా ఉగాదిని మన యుగ ఆరంభంగా జరుపుకుంటామన్నారు. అయితే పాశ్చాత్య నాగరికత, సంస్కృతి ప్రభావానికి గురైన నేటి యువత జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా జరుపుకోవడం విచారకరమన్నారు. మన శ్రేష్టమైన జీవన విధానాన్ని, కనుమరుగవుతున్న సంస్కృతిని రక్షించేందుకు డాక్టర్ హెడ్గెవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారన్నారు. ప్రపంచానికి జ్ఞానబిక్ష పెట్టిన దేశం నేడు ఆత్మన్యూనతభావంతో కొట్టుమిట్టాడుతుందన్నారు. కులం, భాష, వర్గం, ప్రాంతం పేరుతో విడిపోవడం వల్లే విదేశీయులు దండెత్తారని, హిందువులు ఐకమత్యంతో ఉంటే ఈ దేశ అఖండత్వాన్ని కాపాడగలుగుతామనే ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్ గత 90 సంవత్సరాలుగా పని చేస్తోందన్నారు. విదేశి సంస్కృతిని విడనాడి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకముందు స్వయం సేవకులు గోష్ వాయిద్యాలతో పథసంచలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇష్కాన్ అధ్యక్షుడు నరహరిదాస్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘ్‌చాలక్  శంకర్, నగర సంఘ్‌చాలక్  పురుషోత్తం, డాక్టర్  శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Comments

comments