Search
Sunday 18 November 2018
  • :
  • :

భారత్ లక్ష్యం గురించే ప్రపంచం చర్చ

ప్రధాని నరేంద్ర మోడీ

PM-MODI

న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం ‘ఫ్రాజిలె 5’ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ గురించి చర్చ జరిగేదని, ఇప్పుడు ప్రపంచం.. భారత్ ఆర్థిక వ్యవస్థ లక్షం 5 ట్రిలియన్ డాలర్ల గురించే చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎకనమిక్స్ టైమ్స్ ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ కార్యక్రమంలో ఆయన ఈవిధంగా అన్నారు. ఆర్థిక పరంగా భారత్ మెరుగైన పనితీరును కనబరుస్తోందని, గత నాలుగేళ్లలో గ్రాస్ ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో 209 బిలియన్ డాలర్లకు చేరిందని అన్నారు. ప్రస్తుతం ఫ్రాజిలె 5 గురించి భారత్ ఆర్థిక వ్యవస్థ లక్షం గురించే ప్రపంచం ఎక్కువగా చర్చిస్తోందని సదస్సులో ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో ప్రపంచ జిడిపిలో భారత్ వాటా 2.4 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగిందని అన్నారు. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలుకు ముందు 60 లక్షల మంది ట్రేడర్లు మాత్రమే పరోక్ష పన్ను వ్యవస్థలో ఉన్నారని, అయితే జిఎస్‌టి అమలైన తర్వాత ఏడు నెలల్లో ఈ సంఖ్య కోటికి చేరిందని అన్నారు.

Comments

comments