Home తాజా వార్తలు కర్నూలు జిల్లాలో క్వారీ పేలుడు

కర్నూలు జిల్లాలో క్వారీ పేలుడు

The worst danger in Kurnool district

11 మంది మృతి, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం

మన తెలంగాణ/హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్ క్వారీలో పేలుడు సంభవించి 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి భారీ శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్వారీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న లారీ, షెడ్డుకు అంటుకున్నాయి. ఈ మంటల్లో మూడు ట్రాక్టర్లు, ఒక లారీ, రెండు షెడ్డులు దగ్దమైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకోని మంటలను ఆర్పింది. ఆ షెడ్డులో మరి కొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా ఒడిశావాసులుగా గుర్తించారు. బ్లాస్టింగ్ ధాటికి ఒక ఇళ్లు కూడా కూలింది. క్వారీలో చెలరేగిన మంటలతో భారీ శబ్దాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. ఈ క్వారీ శ్రీనివాస్ చౌదరికి చెందినదిగా గుర్తించారు.