Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య..

The young man committed suicide by hanging
రాజాపూర్‌: యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజాపూర్ పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన పోలమోని వెంకటేష్(21) వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఉన్నట్టు కుటుంబ సభ్యులు గమనించి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వెంకటేష్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి పలు మార్లు ఫోన్ చేస్తూ ప్రేమిస్తున్నానని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు వెంకటేష్‌ను మందలించినట్టు సమాచారం. దీంతోనే నమస్థాపం చెంది మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దృవీకరిస్తున్నారు. మృతదేహాన్ని జడ్చర్ల కమ్యునిటి ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించగా, యువకుని మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్నేహితులు కన్నీటి పర్యాంతమయ్యారు. తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments