Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ద్విచక్ర వాహనం నుండి పడి యువకుడి మృతి

The young man died  from bike

కొల్లాపూర్‌: మండల పరిధిలోని ఎల్లూరు గ్రామానికి చెందిన నక్క బాలకృష్ణ (30) శనివారం ద్విచక్రవాహనంపై నుండి క్రిందపడి మరణించారు. స్థానిక ఎస్‌ఐ కథనం ప్రకారం… బాలకృష్ణ ఇంట్లో బయటకు వెళ్ళుతున్నాని చెప్పి కోడేరు మండల కేంద్రం వెళ్ళి అక్కడి నుండి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎన్మన్‌ బెట్ల క్రాస్ రోడ్డు దాటిన వెంటనే రోడ్డు ఎత్తుగా ఉండటంతో బైక్ ఆదుపు తప్పి క్రింద పడ్డాడంతో ముఖనికి తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందినట్టు ఎస్‌ఐ వెంకట సత్యనారాయణ తెలిపారు. బైక్ స్పీడ్ గా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు. బాలకృష్ణకు ఈ నెల 25న వివాహం కుదిరినట్టు తెలిసింది. ఈ సంఘటనపై కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసత్యనారాయణ తెలిపారు.

Comments

comments