Home మంచిర్యాల విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

The young man died with electric shock

బెజ్జూర్: బెజ్జూర్ మండలంలోని ఇందిర్‌గాం గ్రామానికి చెందిన కావిడె విజయ్‌కుమార్ (18) మంగళవారం రాత్రి సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కావిడె విజయ్‌కుమార్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో సెల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్‌షాక్ తగలడంతో గాయపడగా వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషయమించడంతో మృతిచెందినట్టు పేర్కొన్నారు. తల్లి కావిడె శాంతాబాయి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.