Home రాజన్న సిరిసిల్ల అక్సిడెంట్… బాధ తట్టుకొలేక ఆత్మహత్య

అక్సిడెంట్… బాధ తట్టుకొలేక ఆత్మహత్య

The young man hanging and forced to dead

గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో జజ్జరి నవీన్ (30) అనే యువకుడు గురువారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో తన ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… నవీన్ గ్రామంలోనే ఉంటూ హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నవీన్ భార్య స్రవంతి ప్రసూతి కోసం రెండు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లగా అప్పటి నుండి నవీన్ ఒంటరిగానే ఉంటున్నాడు. కాగా ఇటీవల ద్విచక్రవాహనంపై వెళ్తూ నవీన్ ప్రమాదానికి గురికాగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లకుండా తన భార్యకు ఫోన్ చేసి దెబ్బల బాధ తట్టుకోలేక పోతున్నా నేను ఆత్మహత్య చేసుకుంటా అని భార్యకు ఫోన్ చేయగా, ఆమె తన బంధువులను నవీన్ వద్దకు పంపించి చికిత్స చేయించమని కోరింది. స్రవంతి బంధువులు నవీన్ దగ్గరకు వచ్చి ఆసుపత్రికి పోద్దాం అని ఎంత బతిమిలాడినా నేను చచ్చిపోతాను నాకు ఏ ఆసుపత్రి వద్దు అంటూ వచ్చిన బందువులను తిరిగి పంపించాడు. బంధువులు అటు వెళ్లగానే నవీన్ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దూలానికి ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించాడు. కొనవూపిరితో ఉన్న నవీన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాలని దించే సరికి నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. నవీన్‌కు రెండు నెలల పసికందు, భార్య స్రవంతి ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై జాఫర్ షరీఫ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.