Home తాజా వార్తలు చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

body
కీసరః ఇటీవల వివాహం జరిగిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి కీసరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామానికి చెందిన పోలగౌని రమేష్ గౌడ్ (28) గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి కీసరలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న రమేష్ గౌడ్ వివాహం జరిగింది. కాగా బుధవారం ఫోన్ రీచార్జి చేసుకొని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పివెళ్లిన అతను తిరిగి రాలేదు. రాత్రి 9.30 గంటల ప్రాంతలో కీసర పెద్దమ్మ చెరువు వద్ద రమేష్ గౌడ్ ద్వీచక్ర వాహనం , పక్కనే చెప్పులు ఉండటం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించిన ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది. రమేష్ గౌడ్ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తుండగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేసున్నారు.