Search
Thursday 18 October 2018
  • :
  • :

టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్య యత్నం

The young man who climbed tower
జమ్మికుంట: మున్సిపల్ పరిధిలోని హౌజింగ్‌బోర్డ్ వరుద కాల్వ నిర్మాణ పనుల్లో తన ఇంటి స్థలం పోతుందని తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టు తిరిగిన ఫలితం లేదని ఆరోపిస్తూ చెన్నోజు రామచంద్రమూర్తి సోమవారం కొత్తపెల్లి గ్రామంలో గల రైల్వే టవర్ ఎక్కి నానా హంగమా చేశాడు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి దిగే ప్రసక్తే లేదని మొండికేశాడు. స్థానికులు ఎంత చెప్పిన వినకపోవడంతో స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు దేశిని కోటి పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన పట్టణ సిఐ సృజన్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రామచంద్రమూర్తితో మాట్లాడారు. వరుదకాల్వ నిర్మాణం వలన తన ఇంటికి సంబందించిన స్థలం పోతుందని మున్సిపల్ చైర్మన్ రామస్వామి హమి ఇస్తే దిగి వస్తాని తెలుపడంతో ఫోన్ ద్వారా మున్సిపల్ చైర్మన్ రామస్వామికి సిఐ సమాచారం ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ రామస్వామి న్యాయం జరిగేలా చూస్తానని హామి ఇవ్వడంతో భాదితుడు టవర్‌పై నుండి దిగి వచ్చాడు. దాదాపు గంటపైన టవర్ ఎక్కి యువకుడు హంగమా చేశారు. యువకుడు టవర్ ఎక్కిన విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎట్టకేలకు యువకుడు టవర్ దిగడంతో పోలీసులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సిఐ సృజన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామిలు హౌజింగ్ బోర్డ్ లో ఉన్న రామచంద్రమూర్తి ఇంటిని పరిశీలించారు. రామచంద్రమూర్తి ఇంటికి సంబందించిన స్థలం వరుదకాల్వలో పోవడంలేదని ఎవరో చెప్పిన మాటలు విని టవర్ ఎక్కినాడని తన ఇంటికి నష్టం లేకుండ కాల్వ నిర్మాణ పనులు చెపడుతామని తెలిపారు. ఈ సందర్భంగా సిఐ సృజన్‌రెడ్డి, భాదితుడైన రామచంద్రమూర్తికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలకు పాల్పడవద్దని ఏమైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సిఐ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే టవర్ సంఘటన సుఖంతమైందని పలువురు సిఐని అభినందించారు.

Comments

comments