Home Default గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ

గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ

Theft at Govindarajaswamy Templeతిరుపతి :   తిరుమల శ్రీవారి అన్నమయ్య గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఆలయంలోని ఉత్సవమూర్తుల విగ్రహాలకు ఉన్న మూడు విలువైన కిరీటాలు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈఘటన తిరుమలలో  కలకలం రేపింది. గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు ప్రతిరోజు సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో స్వామివారితో పాటు అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తారు. వారికి అలంకరించేందుకు వివిధ వజ్రాభరణాలతో కూడిన ఆరు పురాతన కిరీటాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ కిరీటాలను  సాధారణ రోజుల్లో మూలవిరాట్టుకు సమీపంలోనే ఉంచుతారు. స్వామివారి ఒంటిపై ఒక జతతోపాటు మరో జత కిరీటాలు, హారాలు విడిగా ఉంటాయి. శనివారం ఉదయం సుప్రభాతసేవ సమయంలో కనిపించిన ఈ కిరీటాలు తర్వాత మాయమయ్యాయి. టిటిడి విజిలెన్స్‌ శాఖకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ కిరీటాలు మాయం కావడాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆలయ అధికారులు ఆలయ సిబ్బందిని విచారించారు.  ఆలయం మూసివేత అనంతరం రాత్రి 9 గంటలకు అర్బన్‌ ఎస్ పి అన్బురాజన్‌, టిటిడి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి గోపినాథ్‌జెట్టి, టిటిడి జేఈవో పోలా భాస్కర్‌ గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చి ఈ ఘటనపై విచారించారు. మూడు కిరీటాలు కన్పించడం లేదని వారు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Theft at Govindarajaswamy Temple