Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఎంపి ఇంట్లో చోరీ

SUMAN-HOUSE

మంచిర్యాల : పెద్దపల్లి టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. మంచిర్యాల గౌతమ్‌నగర్‌లోని ఎంపి సుమన్ నివాసంతో పాటు మరో మూడు ఇళ్లల్లో చోరీ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఓ ఇంట్లో లక్ష రూపాయల నగదును అపహరించారు. చోరీ జరిగిన మిగతా ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో చోరీ వివరాలు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Theft at Peddapally MPs House

Comments

comments