Search
Tuesday 20 November 2018
  • :
  • :

పట్టపగలే దొంగతనం…

THEFT

మల్గకల్: మండల పరిధిలొని ఎల్కూర్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగి రూ.4లక్షల నగదు, రెండున్నర తులాల బంగారు అపహరణకు గురైంది. మల్దకల్ పోలీసుల వివరాల ప్రకారం… ఎల్కూర్ గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం 11 గంటలకు  గద్వాలకు వెళ్లగా ఆయన భార్య పొలానికి వెళ్లింది. కుమారుడు స్కూల్ కు వెళ్లాడు. దీంతో ఇల్లు తాళం వేసి ఆంజనేయులు గద్వాలకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలో గల రూ. 4 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిపోయినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధితుడు పొలీసులకు పిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిసింది. కాగా సిఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని పట్టపగలే దొంగతనం జరగడం పట్ల పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలిసింది.

Comments

comments