Home తాజా వార్తలు తాళ్లతో కట్టేసి… గదిలో బంధించి దొంగతనం

తాళ్లతో కట్టేసి… గదిలో బంధించి దొంగతనం

మూడు తులాల బంగారం, వెయ్యి నగదు, బైక్‌తో పరారీ

Robbery

 

మనతెలంగాణ/లక్షెట్టిపేటరూరల్: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట  మండలంలోని అంకత్‌పల్లి గ్రామ స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఒక కుటుంబాన్ని గదిలో బందించి బంగారం, నగదు, బైక్ దోచుకొని పరారైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌ఒ డిజి రాజయ్య తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గురువారం రాత్రి  9.30గంటల సమయంలో అంకత్‌పల్లికి చెందిన అరిగెల చందు అనే వ్యక్తి తన ఇంట్లో భార్య ఇద్దరు పిల్లలతో టివి చూస్తుండగా ముగ్గురు దుండగులు ముఖానికి గుడ్డను కట్టుకుని కత్తితో బెదిరించి చేతులు కట్టేసి రూంలో బంధిచారన్నారు. కుటుంబం మొత్తం రాత్రంతా రూంలోనే ఉన్నామని ఉదయం ఇంటికి వచ్చిన వారు గది తలుపులు తీయడంతో బయటికి వచ్చినట్లు తెలిపారు. గదిలోనుండి బయటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో చూడగా దుండగులు ఇంట్లో ఉన్న సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెయ్యి రూపాయలు నగదు, టిఎస్19బి5603 నెంబర్ గల గ్లామర్ బైక్‌ను దొంగలించుకుని పరారయ్యారన్నారు. ఘటనా స్థలాన్ని మంచిర్యాల ఎసిపి గౌస్‌బాబాతోపాటు స్థానిక సిఐ శ్రీనివాస్ పరిశీలించారని క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌తో దొంగల కోసం గాలిస్తున్నట్లు, ఇంటి యజమాని చందు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.