Home ఖమ్మం విఘ్నేశ్వర ఆలయంలో భారీ చోరి

విఘ్నేశ్వర ఆలయంలో భారీ చోరి

Theft-in-Templeరూ.లక్ష విలువచేసే పంచలోహ విగ్రహాలు, నగదు దోపిడి
ఆదారాలు సేకరించిన క్లూస్ టీం
ఇల్లందు : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం తెల్లవారుజామున చోరీ సంఘటన చోటుచేసుకుంది. రోజులాగే అర్చకుడు కాశీ విశ్వనాధ శర్మ మంగళవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు ముగించుకొని ఆలయానికి తాళాలు వేసి ఇంటి వెళ్లాడు. బుధవారం ఉదయం పూజలు ప్రారంభించేందుకు ఆలయానికి వచ్చే సరికి గేటు తాళాలు పగులగొట్టి తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించిన పూజారి పోలీసులకు సమాచారం అందించారు. హుండిలో భక్తులు వేసిన కానుకలు సుమారు రూ.10వేల నగదు తోపాటు పది కిలోల పంచలోహ గణపతి విగ్రహాలు రెండు, రెండు ఇత్తడి, రాగితో చేసిన శఠగోపాలు, ఇత్తడి తాంబూలం, ఐదు తులాల వెండి వినాయకుడి విగ్రహం, 11 తులాల స్వామివారి వెండి గంజం, అంజనేయస్వామి ఇత్తడి విగ్రహం చోరీకి గురైనట్లు ఆలయ అర్చకుడు కాశీ విశ్వనాధ శర్మ పోలీసులకు వివరించారు. వీటి విలువ మొత్తం రూ.1 లక్ష వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆలయ అర్చకుడి ఫిర్యాదుతో ఆలయానికి చేరుకున్న సిఐ అల్లం నరేందర్, ఎస్‌ఐ అశోక్‌లు పూజారితోపాటు చుట్టుపక్కల నివాసముంటున్న వారిని విచారించారు. ఖమ్మం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆదారాలు సేకరించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను త్వరలో పట్టుకుని సొత్తును స్వాదీనం చేసుకుంటామని సిఐ నరేందర్ తెలిపారు. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు బస్తీల్లో సంచరిస్తే సమాచారం అందించాలని ఆయన సూచించారు.