Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మహబూబ్‌నగర్‌ను మోడల్ టౌన్‌గా మారుస్తా

Their government will work for women's development

జిల్లా కేంద్రంలో 4 మినీ ట్యాంక్ బండ్లు నిర్మిస్తాం
తమ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తుంది
ఐటి హబ్, బైపాస్, మయూరి లాంటి ప్రజామోద కార్యక్రమాలు మా కృషే
మహిళా సంఘాలతో ఇష్టాగోష్టిలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్                                                                                        ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తుంది
ఐటి హబ్, బైపాస్, మయూరి లాంటి ప్రజామోద కార్యక్రమాలే మా కృషి

మన తెలంగాణ/పాలమూరు : మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఒక మాడల్ నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే మహబూబ్‌నగర్ ప్రజల కలగా మిగిలిపోయిన బైపాస్‌ని సాధించిన ఘనత తమదే అన్నారు. జిల్లా ప్రజలకు వారాంతంలో ఆటవిడుపుకి మయూరి పార్కు నిర్మించి వారి కళ్లల్లో ఆనందం చూపామన్నారు. మన్యంకొండ దేవస్థానము అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణలో 4 మినీ ట్యాంకుబండ్ నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు వడ్డీలేని రుణాలు జిల్లాకి 100 కోట్లు ఇప్పించడం జరిగిందని తెలిపారు. తర్వాత సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధాఅమర్, మహిళా కౌన్సిలర్లు కోరమోని వనజ, కోరమోని జ్యోతి, బురుజు కల్పన, ప్రసన్న, అనిత, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments