Search
Tuesday 20 November 2018
  • :
  • :

యంగ్‌గా కనిపించాలంటే..?

Their likes to look less like her age

ఎవరికైనా ఉన్న వయసు కంటే తక్కువగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ఇది మేకప్‌తో ఏమాత్రం సాధ్యంకాదు. కేవలం తీసుకునే ఆహారం వల్లే సాధ్యమవుతుంది. వయసులో చిన్నవారిగా.. అనుభవంలో పెద్దవారిగా కనిపించాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఎంత వయసు వచ్చినా.. ఆ వయసు ఛాయలు ముఖంలో కనిపిస్తే మాత్రం తట్టుకోలేరు. చర్మం ముడతలు పడినా.. జుట్టు కాస్త నెరిసినా.. బాధపడిపోతుంటారు. ముఖంలో కాస్త వయసు కనపడితే చాలు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా కాకుండా పెరిగే వయసు శరీరంపై కనిపించకుండా ఉండాలంటే యాంటి-ఏజింగ్ డైట్ తీసుకోవాలి. ఈ డైట్‌లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
1 బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపిస్తారు. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శారీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించగలరు.
2 చిలగడదుంప, కేరట్, గుమ్మడి కాయల్లో బీటా- కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కండ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయి.
3 ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయసు కనపడదు.
4 కీర కూడా యాంటి ఏజింగ్ ఫుడ్. కీరలో నీరు బాగా ఉండడం వల్ల యంగ్ లుక్స్ పోవు. చర్మంపై ముడతలు పడవు.
5 విటమిన్-సి అధికంగా ఉంటే ఉన్న బ్రొకెల్లీ తింటే చర్మం ముడతలు పడదు. వయసుతోపాటు వచ్చే చర్మం పొడిబారిపోయే గుణం కూడా పోతుంది.
6 సాల్మన్ చేపలు యాంటి-ఏజింగ్‌గా బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు.
7 ఆలివ్ నూనె వాడితే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మం, శిరోజాలు మెరుస్తుంటాయి.

Comments

comments