Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కృష్ణా బేసిన్‌లో రోజు వారి నీటిమట్టాలు

dam

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: కృష్ణాబేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటిమట్టాల వివరాలను సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలి యజేశారు. శుక్రవారం కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగ భద్ర, తెలంగాణలోని జూరాలా, శ్రీశైలం, కడెంశ్రీపాదరావు, నాగార్జున సాగర్, కేఎల్‌రావు ప్రాజెక్టు సంబంధించిన వివరాలను జూరాలా ప్రాజె క్టు డీఈ శ్రీధర్ తెలియజేశారు. వాటి వివరాలు ఇలా..1).ఆల్మట్టి ప్రాజె క్ట్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 129.72టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 97.95 టీఎంసీలు.2).నారాయణపూర్ ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటిమ ట్టం 37.646 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.18టీఎంసీలు.3)తుం గభద్ర ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 100.86 టీఎసీలు కాగా, ప్రస్తుతం 47.49 టీఎంసీలు.4).శ్రీశైలం ప్రాజెక్టు: పూర్తిస్థాయి నీటిమ ట్టం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 147.63 టీఎంసీలు.5). నాగార్జునసాగర్ ప్రాజెక్టు:పూర్తి స్థాయి నీటిమట్టం 312.045 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 221.83  టిఎంసీలు.6).కె.ఎల్.రావు ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.50 టీఎంసీలు.7).కడెం శ్రీపాదరావు ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటి మట్టం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.93 టీ ఎంసీలు.8).జూరాలా ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 318.330 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అధేవిధంగా జలాశయం మొత్తం సామర్థం 9.275 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 5.568 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 230 క్యుసెక్కులు వస్తుండగా, స్పిల్‌వే-నిల్, పవర్‌హౌజుకు నిల్ క్కుసెక్కులు, కుడి ప్రధాన కాలువకు 215 క్యుసెక్కులు, ఎడమ ప్రధాన కాలువకు 820 సెక్కుల నీటిని, నెట్టెంపాడుకు నిల్, భీమాకు లిఫ్టు1కు-1నిల్, లిఫ్టు2 కు నిల్, కోయిల్‌సాగర్‌కు -నిల్, సమాంతర కాలువకు 120  క్యుసెక్కులను విడుదల చేస్తున్నట్లు డీఈ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మొత్తం 1179 క్యుసెక్కుల నీరు విడుదల చేసినట్లు వెల్లడించారు.

Comments

comments