Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

సరిహద్దులో రెడ్ అలర్ట్

Theme of the commemoration of Maoist martyrs

మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యం
ప్రాణహిత అడవుల్లో మావోయిస్టుల కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు
మావోయిస్టు హెచ్చరికలతో నేతల్లో గుబులు

మన తెలంగాణ/మంచిర్యాల : మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను శనివారం నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్నందు వల్ల పోలీసులు అప్రమత్తమై జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల క్రితమే భూపాల్‌పల్లి జిల్లాలోని మహాముత్తారం, వెంకటాపూర్ మండలాల్లో మావోయిస్టులు కరపత్రాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు వెలువడగా ఇందులో ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేయడమే కాకుండా అధికార పార్టీ నాయకులకు ప్రజా కోర్టులో శిక్షవేస్తానని, అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వారి పద్దతులు మార్చుకోవాలని, లేని పక్షం లో శిక్ష తప్పదని పేర్కొన్నారు. అధికార పార్టీ అగ్రనేతలతో పాటు ప్రతిపక్ష కాం గ్రెస్ పార్టీలతో కలసి 20 మంది పేర్లను ప్రస్తావించగా నేతల గుండెల్లో గుబులు రేగుతోంది.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ నేతృత్వంలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దులోని ప్రాణహిత అడవుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరింపచేశారు. ఒకవైపు మ హారాష్ట్ర పోలీసులు, మరోవైపు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతా ల్లో ఉన్న కోటపల్లి, నీల్వాయి, వేమనపల్లి, నెన్నెల, తాండూర్ మం డలాల పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసి, గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్చిరోలి జిల్లాలో గత కొంతకాలంగా అలజడులు సృష్టిస్తున్న మావోయిస్టులు ప్రాణహిత నది దాటి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందువల్ల పోలీసులు ప్రాణహిత అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలను ప్రారంభించారు. పోలీసుల బూ ట్ల చప్పుళ్లతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిసే వరకు ప్రజాప్రతినిధులు మారుమూల ప్రాంతాలకు వెళ్లరాదని, అవసరమైతే పోలీసులు బందోబస్తు తీసుకెళ్లాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సూచించారు.

Comments

comments