Search
Thursday 15 November 2018
  • :
  • :

అప్పుడు వాజ్‌పేయి … ఇప్పుడు మోడీ

Then Vajpayee ... Now Modi

ఢిల్లీ : సుమారు 15ఏళ్ల క్రితం నాటి ప్రధాని వాజ్‌పేయి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎదుర్కోబోతున్నారు. 2003లో నాటి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడంతో దాన్ని స్పీకర్ స్వీకరించారు. ఈ తీర్మానాన్ని నాడు సోనియాగాంధీ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇదే చివరి అవిశ్వాస తీర్మానం. ఈ అవిశ్వాస తీర్మానం 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది. బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రాంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి 50 మంది ఎంపిలు మద్ధతు తెలిపారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఈ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్‌డిఎ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపట్టనున్నట్టు స్పీకర్ తెలిపారు.

Then Vajpayee … Now Modi

Comments

comments