Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

వర్షాతిరేకం

There is a drought in the state

రాష్ట్రంలో కరువుదీరా వానలు                                                                                                                        చెరువులు, కుంటలకు జలకళ                                                                                                                                5385 చెరువుల్లో అలుగు దూకిన నీరు
నిండిన 19 మీడియం ప్రాజెక్టులు                                                                                                                          ఎల్లంపల్లి, కడెం గేట్లు ఎత్తివేత                                                                                                                                తుంగభద్రకు భారీగా వరద

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కరువు తీరా వానలు పడుతున్నాయి. మేజర్ రిజర్వాయ ర్లు మొదలుకొని చెరువులు, కుంటల వరకు అన్నింటికీ జలకళ వచ్చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మినహా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయి లో వర్షపాతం నమోదైంది. రామగుండంలో 2006లో గరిష్టంగా 216.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా, తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ గత 24 గంటల్లో 264.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిం ది. కృష్ణా బేసిన్ పరిధిలో పెద్దగా వర్షం కురవకు న్నా, కర్ణాటకలో కురిసిన వర్షాలతో తుంగభద్ర ద్వారా నీరు శ్రీశైలానికి చేరుతోంది. గోదావరి బేసిన్‌లో రికార్డుస్థాయి వర్షం కురిసింది. ఈ కారణంగా ఎల్లంపల్లిలో 27 గేట్లను ఎత్తిన అధికారు లు నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తి నీటిని ఎల్లంపల్లిలోకి వదిలారు. రాష్ట్రంలోని 36 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులుండగా అందులో 19 ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది.

గోదావరి బేసిన్‌లో 16 ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్‌లో 3 ప్రాజెక్టులు ఇందు లో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో రిజర్వాయ ర్లు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు, కుమ్రం భీం జిల్లాలోని ఎన్టీఆర్ సాగర్, పిపిరావు ప్రాజెక్టు, కుమ్రం భీం ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాలోని నీల్వాయి, ర్యాలివాగు, భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం, పాలెం వాగు ప్రాజెక్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు ప్రాజెక్టులు వరద నీటితో నిండా యి. గోదావరి బేసిన్‌లోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు 1,85,887 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, 55800 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా బేసిన్ పరిధిలో ఖమ్మం జిల్లాలోని వైరా, లంకాసాగర్, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ప్రాజెక్టులోకి వరదనీరు చేరి జలకళ సంతరించుకుంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారా 10054 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 519 క్యూసెక్కులు మాత్రమే దిగువకు వదులుతున్నారు.

వరద నీటితో నిండిన చెరువులు
భారీ వర్షాలతో వస్తున్న వరద నీటితో రాష్ట్రంలోని చెరువులకు జలకళ వచ్చింది. ఇప్పటికే గోదావరి బేసిన్‌లోని 50 శాతం చెరువులు నిండాయి. గోదావరి బేసిన్ పరిధిలోని ఆదిలాబాద్ సర్కిల్‌లో 2747 చెరువులు ఉండగా, 693 చెరువుల్లో ఇప్పటికే మత్తడిపారింది. మరో 1290 చెరువుల్లో ముప్పావు వంతుకు పైగా నీరొచ్చింది. 404 చెరువులు సగానికి పైగా నీరు రాగా, 280 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరొచ్చింది. 80 చెరువుల్లో మాత్రమే 25 శాతం కంటే తక్కువ నీరుంది. కరీంనగర్ సర్కిల్ పరిధిలో 4526 చెరువులకు గాను మత్తడిపారిన చెరువులు 959 కాగా, 505 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరొచ్చింది. 1306 చెరువుల్లో సగానికి పైగా నీరు రాగా, 275 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరొచ్చింది. 1481 చెరువుల్లో 25 శాతం నీరొచ్చింది. వరంగల్ సర్కిల్‌లో 6529 చెరువుల్లో 2068 చెరువుల్లో మత్తడి పారింది. 1613 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరొచ్చింది. 847 చెరువుల్లో 50 శాతానికి పైగా నీరొచ్చింది. 534 చెరువుల్లో 25 శాతానికి ఎక్కువగా నీరు రాగా, 1467 చెరువుల్లో 25 శాతాని కంటే తక్కువగా నీరొచ్చింది.

ఖమ్మం సర్కిల్ పరిధిలోని 3806 చెరువుల్లో 1572 చెరువుల్లో మత్తడి పారింది. 1578 చెరువుల్లో 75 శాతానికి పైగా, 469 చెరువుల్లో 50 శాతానికి పైగా నీరు చేరింది. 187 చెరువుల్లో మాత్రం నీరు సగం కంటే తక్కువగా ఉంది. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 2513 చెరువులకు గాను 12 చెరువులు మత్తడి పారగా, 94 చెరువుల్లో ముప్పావు వంతు నీరు చేరింది. 197 చెరువుల్లో సగానికి పైగా నీరు రాగా, 617 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరొచ్చింది. 1593 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువగా నీరుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని సంగారెడ్డి సర్కిల్‌లో 8748 చెరువులు ఉండగా 80 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరొచ్చింది. 83 చెరువుల్లో సగానికి పైగా, 544 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరు చేరింది. ఇంకా 8041 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువగానే నీరు ఉంది. రంగారెడ్డి సర్కిల్ పరిధిలో 3778 చెరువులకు గాను కేవలం 23 చెరువులు మాత్రమే మత్తడి పారాయి. 32 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు ఉంది. 83 చెరువుల్లో సగానికి పైగా నీరు ఉండగా, 265 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరు చేరింది. ఇంకా 3375 చెరువుల్లో 25 శాతం లోపు మాత్రమే నీరు ఉంది. నల్లగొండ సర్కిల్ పరిధిలో 4652 చెరువుల్లో 15 చెరువుల్లో మాత్రమే అలుగు పారేలా నీరొచ్చింది.

114 చెరువుల్లో ముప్పావు వంతు నీరు చేరింది. 89 చెరువుల్లో 50 శాతానికి పైగా, 363 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరు చేరింది. 4071 చెరువుల్లో 25 శాతం లోపు మాత్రమే నీరు చేరింది. మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో 6526 చెరువులు ఉండగా 81 చెరువులు ఇప్పటికే మత్తడిపారాయి. 231 చెరువుల్లో 75 శాతానికి పైగా, 269 చెరువుల్లో 50 శాతానికి పైగా, 1489 చెరువుల్లో 25 శాతానికి పైగా నీరు వచ్చింది. ఇంకా 6174 చెరువులు 25 శాతం లోపు నీటితో వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా 43825 చెరువుల్లో 5385 చెరువులు రాష్ట్రంలో మత్తడిపారాయి. ఇంకా 5311 చెరువుల్లో 75 శాతానికి పైగా నీటితో కళకళలాడుతున్నాయి. మరికొంత వాన వస్తే ఇవి మత్తడిపారుతాయి. 3492 చెరువుల్లో 50 శాతానికి కంటే ఎక్కువగా నీరు ఉండగా, 3334 చెరువుల్లో 25 శాతాని కంటే ఎక్కువ నీరు ఉంది. ఇంకా 26303 చెరువుల్లో మాత్రం 25 శాతం కంటే తక్కువగా నీరు ఉంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, కాలువలు, అప్రోచ్ కెనాళ్లకు మరమ్మత్తులు చేశారు. ఫలితంగా చాలా చెరువులు నీటిని ఒడిసిపట్టాయి.

అప్రమత్తంగా ఉండండి : అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి జలసౌధలో సమీక్షించారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా చెరువులు, కాలువల కట్టలు తెగే పరిస్థితి ఉంటే, ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపించాలని ఆదేశించారు.

Comments

comments