Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించే ఆలోచన లేదు: కేంద్రం

petrol

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వీటి ధరలు భారీ స్థాయికి చేరితే చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలు వారం రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలను సవరించలేదు. పెట్రోలు లీటరు ధర రూ.74.63కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.65.93 కు పెరిగింది. వీటి ధరలు 55 నెలల గరిష్ఠానికి చేరాయి. గత వారం క్రితం రికార్డు స్థాయిల్లో ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అప్పటి నుంచి లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.63, కోల్‌కత్తాలో రూ.77.32, ముంబైలో రూ.82.48, చెన్నైలో రూ.77.43గా ఉన్నాయి. బెంగళూరులో ఒక్క లీటరు పెట్రోల్ ధర రూ.75.82గా ఉంది.

Comments

comments