Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎక్సైజ్ సుంకంలో కోత లేదు

 bs

చమురు ధరలు పెరిగితే దేశీయ ఆర్థిక వ్యవస్థపై భారం

 దిగుమతి బిల్లు 50 బిలియన్ డాలర్లకు పెరగనుంది..
 కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్

న్యూఢిల్లీ: చమురు ధరల పెరుగుదల నుంచి భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకంలో కోత విధించే ఆలోచన ఇప్పటికీ లేదని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆందోళన కల్గిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణంగా దిగుమతి బిల్లు 50 బిలియన్ డాలర్లు పెరగనుందని, కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం పడనుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రభావమేమీ ఉండదని అన్నారు. ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోనుందని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకంలో కోత విధిస్తుందా? అని ప్రశ్నించినప్పుడు ఆయన స్పందిస్తూ.. ఇప్పడే ఏమీ చెప్పలేమని, వేచిచూడాలని అన్నారు. చమురు ధరల పెరుగదల కారణంగా దిగుమతుల బిల్లు 25 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు(రూ.3,39,867 కోట్లు) పెరగనుందని అన్నారు. గత ఏడాదిలో చమురు దిగుమతులపై భారత్ 72 బిలియన్ డాలర్లు అంటే రూ.4,89,525 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు.
భారత్‌కు ‘చమురు’ ఎఫెక్ట్
సరఫరా కొరత కారణంగా తొలిసారి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 80 డాలర్లకు పెరిగింది. 2014 నవంబర్ నుంచి ఇంతలా చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి.. చమురు కోసం భారత్‌లో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడింది. దేశంలో చమురు అవసరాల కోసం దాదాపు 80 శాతం ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది. అమెరికా, చైనా దేశాల తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్ కావడం గమనార్హం. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. దేశంపై ముడి చమురు ధర ప్రభావం భారత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
1 అమెరికా, చైనా దేశాల తర్వాత భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు.. వార్షికంగా 1,575 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.
2. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించడం చమురు బిల్లుపై ప్రభావం చూపుతోంది. సంవత్సరానికి భారత్ చమురు దిగుమతుల విలువ సుమారుగా 1.6 బిలియన్ డాలర్లు అంటే రూ.10 వేల కోట్లు ఉంటుందని కేర్ రేటింగ్స్ వెల్లడించింది.
3. బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థలో 0.1 శాతం, జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో 0.4 శా తం ఎఫెక్ట్ ఉంటుందని అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది.
4. బ్యారెల్ ధర 10 రూపాయలు పెరిగితే జిడిపి వృద్ధి రేటు 0.2 నుంచి 0.3 శాతం డౌన్ అవుతుందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణ్యన్ కూడా చెప్పారు. కరెంట్ ఖాతా లోటు 910 బిలియన్ డాలర్లు ఉంటుందని అన్నారు.
5. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని నోమురా అంచనా వేస్తోంది.
6. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ముడిచమురు ధరలు 20 శాతం పెరిగాయి.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ అత్యంతగా రూ. 3 పతనమైంది. ఏప్రిల్‌లో డాలరుపై రూపాయి 65 స్థాయిలో ఉంటే.. తాజాగా 68 దిగువకు పతనమైంది. 2017 జనవరి నాటి స్థాయికి రూపాయి విలువ క్షీణించింది.
7. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్న అంచనాలతో డాలరు 93.5కు బలపడింది.
8. 2017-18లో 83 శాతం చమురును భారత్ దిగుమతి చేసుకుంది.కోవలసి వచ్చింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌లో 69 డాలర్ల స్థాయిలో ఉన్నాయి. అప్పట్లో రూపాయి విలువ కూడా 65-66 స్థాయిలో ట్రేడయ్యింది. దిగుమతుల బిల్లును డాలర్లలో చెల్లించాల్సి ఉండటంతో రూపాయి మరింత బలహీనడనుంది.
9. మరోవైపు భారత్ నుంచి ఎగుమతుల కంటే దిగుమతుల బిల్లే ఎక్కువగా ఉండడం కూడా డాలర్లకు డిమాండ్‌ను పెంచుతోంది. ప్రధానంగా ముడిచమురు, డాలరు బలపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక లోటుకు కారణమవుతున్నాయి.
10.దేశీయంగా పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీంతో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.
11. గత వారం చమురు నిల్వలు 1.4 మిలియన్ బ్యారళ్లమేర క్షీణించాయని అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్ స్టాక్‌పైల్స్ కూడా 3.79 మిలియన్లు తగ్గినట్లు తెలిపింది.
12. ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఇరాన్ 4 శాతం వాటాను కల్గి ఉంది. అదే సమయంలో వెనిజులా నుంచి చమురు సరఫరా తగ్గింది.
13. ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరాలు తగ్గి ధరలు పెరుగుతున్నాయి.

Comments

comments