Home నిజామాబాద్ మరుగుదొడ్లపై మరుగున పడిన విచారణ..

మరుగుదొడ్లపై మరుగున పడిన విచారణ..

There is no investigation on toilets

బోధన్: మండలంలోని ఆయా గ్రామాలలో వ్యక్తి గత మరుగుదొడ్ల అక్రమాలపై జరిగిన విచారణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొన్ని నెలల క్రితం మనతెలంగాణ జిల్లా ఎడిసన్‌గా వచ్చిన మరుగుదొడ్లలో అవినీతి కంపు, భారీ అక్రమాలు మృతుల పేరిట మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు అనే వార్త రావడంతో అధికారులు వెంటనే స్పందించి ఊట్‌పల్లి గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపారు. ఈ విచారణలో చనిపోయిన వారి పేరిట చెల్లింపులు జరిగినట్టు అలాగే అనర్హులు సైతం మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు పొందినట్లు తేలింది. కాని ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా విచారణకు వచ్చిన అధికారులు విచారణ చేపట్టిన అనంతరం తీసుకున్న చర్యలు ఏమిటో ఇప్పటికీ ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఈ అవినీతి కంపులో సుమారు రూ.50 లక్షల వరకు నిధులు బోకసుల పేరిట చెల్లింపులు జరిపినట్టు సమాచారం కాని ఇంతవరకు ఈ నిధులను రికవరీ చేసారా లేదా అనేది స్పష్టం కావడంలేదు. మండలంలోని 8 గ్రామాలైన సాలూరా, పెగడాపల్లి, హున్సా, ఖండ్‌గాం, పెంటకుర్దు, సంగెం, హంగర్గ, గ్రామాలలో అవినీతి జరగగా విచారణ మాత్రం ఊట్‌పల్లి గ్రామంలోనే జరిపారు. అధికారుల పాత్ర కూడా ఈ మరుగుదొడ్ల అవినీతి కంపులో ఉండడంతో విచారణ అటకకెక్కిచ్చినట్లు సమాచారం ఇకనైనా ఉన్నతాధికారులు ఈ అవినీతి కంపుపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.