Home రాష్ట్ర వార్తలు ముందస్తు నో

ముందస్తు నో

  • ముందుగానే ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు
  • మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారు
  • కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది
  • కాంట్రాక్టు కొలువులు ఉండకూడదనే నా ఉద్దేశం
  • అర్హులైన హోంగార్డులకు పోలీసు ఉద్యోగాలు
  • అటెండర్లుగా మిగతా వారు
  • మైనారిటీలు, గిరిజనులకు 12% కోటా ఇచ్చి తీరుతాం : శాసనమండలిలో సిఎం కెసిఆర్

KCR-Council

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలి లో బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానంపై చర్చకు ఆయన సమా ధానమిచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందు కు టిఆర్‌ఎస్ సిద్ధమవుతుందని పిసిసి అధ్యక్షు డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ముందు గా ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం తమకే మాత్రం లేదని స్పష్టం చేశారు. మంచిగా పని చేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు. సాగునీటి ప్రా జెక్టులపై కాంగ్రెస్ కావాలని రాద్ధాంతం చేస్తోం దని, తప్పుడు సమాచారంతో గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళి స్టేలు తేవడం సరైంది కాదన్నారు. రాష్ట్రాభి వృద్ధిలో కలిసి రావాలని, వెంటనే స్టేలు ఎత్తివేసే లా చూడాలని చెప్పారు. డిగ్రీ కళాశాలల లెక్చ రర్లను పర్మినెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని, తీరా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళి స్టే తీసు కు వచ్చిందన్నారు. తెలంగాణలో ఒప్పంద సిబ్బంది ఉండొద్దనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలి పారు. అర్హత ఉన్న హోంగార్డులకు పోలీసు ఉద్యోగాలు, మిగతా వారికి అటెండర్లు తదితర ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన ఇస్తామని ప్రకటించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ సర ఫరా చేస్తున్నామని, కొంత మంది విద్యుత్ కోత లు మొదలవుతాయని తప్పుడు ప్రచారం చేస్తు న్నారని, నాలుగు గంటలు కాదు నాలుగు సెక న్లు కూడా విద్యుత్ కొరత ఉండదని పేర్కొ న్నారు. కుల వృత్తులను కాపాడటమే ప్రభుత్వ లక్షమని, ఇందుకోసం బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులను కేటాయించామన్నారు. వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలోని యాదవులందరూ కోటీశ్వరులు కావడం ఖాయమన్నారు. దీన్ని కూడా విపక్షాలు విమర్శించడం దారుణమన్నారు.
రిజర్వేషన్ల కోసంజంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా : మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని, ఇందు కోసం చట్టంలో మార్పులు తేనున్నామన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం రూపొందించిన చట్టాన్ని అనుసరిం చాలనడం సరైంది కాదన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తానన్నారు. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకే అధికారాలిస్తూ చట్టంలో మార్పులు చేయాలని కెసిఆర్ అన్నారు. అవసరమైతే అన్ని రాష్ట్రాల సిఎంలతో సమావేశం నిర్వహిస్తానని, అప్పటికీ సాధ్యం కాకపోతే ఎంఎల్‌ఏలు, ఎంపిలను తీసుకెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సైతం సిద్దమవుతానని అన్నారు.రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని గ్రామాలను తీసుకుందని, అందులో నుంచి నాలుగు గ్రామాలను తిరిగి తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు.
ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల అప్పు తీరుస్తున్నాం : అప్పులు చేసి గొప్ప లు చెప్పుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై సిఎం స్పంది స్తూ అప్పులు చేయడం సరైందేనని సమర్థించుకున్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద దేశమైన అమెరికా కూడా ప్రపంచంలోని ఏ దేశానికి లేనన్ని అప్పులున్నాయని, అవకాశాలు ఉండి అప్పు తీసుకోకపోతే అస మర్థుల మవుతామన్నారు. ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల అప్పును తీరుస్తున్నామ న్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 60 ఏళ్ళలో రూ. 60 వేల అప్పు లు చేస్తే తాము మూడేళ్ళలో రూ. 70 వేల అప్పులు చేశారని చేసిన విమ ర్శలను ప్రస్తావించిన కెసిఆర్ అప్పటి రూపాయి విలువ ప్రస్తుత రూపా యి విలువ ఎంతుందో తెలియదా అని ప్రశ్నించా రు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు రూ. 92 కోట్లు అయ్యింద ని, ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిర్మించాలంటే రూ. 92 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.
మీ డిఎన్‌ఎలో కాంగ్రెస్ ఉంది – షబ్బీర్ అలీ : మధ్యలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పదే పదే కాంగ్రెస్‌ను విమర్శించడం సరైంది కాదని, రూపాయి విలువపై మీరన్నట్లు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మీ డిఎన్‌ఎలో కాంగ్రెస్ ఉందని,యూత్ కాంగ్రెస్ నుండే మీ రాజకీయ జీవితం మొదలైన విషయాన్ని మరువద్దని అనడంతో కెసిఆర్‌తో పాటు సభలోని సభ్యులంతా నవ్వారు.